ENGLISH

సోనూ సూద్‌ హీరోగా సినిమా.?

29 September 2020-18:00 PM

సోనూ సూద్‌ కొన్ని సినిమాల్లో పాజిటివ్‌ రోల్స్‌లో కనిపించిన మాట వాస్తవం. అయితే, తెరపై ఆయన్ని కరడుగుట్టిన విలన్‌ పాత్రల్లోనే ఎక్కువగా చూశాం. కానీ, రియల్‌ లైఫ్‌లో సోనూ సూద్‌ అసలు సిసలు హీరో. కరోనా నేపథ్యంలో సోనూ సూద్‌ పెద్ద మనసు ఏంటో అందరికీ అర్థమయ్యింది. దేశంలో ఏ స్టార్‌ హీరో కూడా చేయని విధంగా సోనూ సూద్‌, తనకు చేతనైన మేర సాయం చేశాడు.. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాల్ని వేడుకోవడం కాదు, సోనూసూద్‌కి రిక్వెస్ట్‌ పెట్టుకున్నారు.

 

అలా వచ్చిన చాలా రిక్వెస్ట్‌లను సోనూసూద్‌ పరిగణనలోకి తీసుకుని, సాయం అందించాడు. అందుకేనేమో, ఇప్పుడు దేశమంతా రియల్‌ హీరో సోనూ సూద్‌ అంటోంది. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించేందుకు తెలుగులో సన్నాహాలు జరుగుతున్నాయట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనూ సూద్‌ హీరోగా సినిమా తెరకెక్కించడానికి సన్నద్ధమవుతోందని సమాచారం.

 

కథ కూడా సిద్ధమయ్యిందనీ, కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తాడనీ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సోనూ సూద్‌కి హీరోయిన్‌ కూడా వుంటుందట. ఆ పాత్ర కోసం ఓ ప్రముఖ హీరోయిన్‌ పేరుని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్‌ కానుందని అంటున్నారు. ప్రస్తుతం సోనూ సూద్‌, హైద్రాబాద్‌లోనే ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం వున్నాడు.

ALSO READ: ఎఫ్ 3.. 3 నెల‌ల్లోనే!