ENGLISH

ఎస్‌.పి.బి కి క‌రోనా.. ప్ర‌స్తుతం క్షేమం.

05 August 2020-14:04 PM

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. గత రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నట్లు, వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని, తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు.

 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అందరి అశీస్సులతో తొందరలోనే కోలుకుంటానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ''కొన్ని రోజులుగా ఒంట్లో బాగాలేదు. ప‌రీక్ష‌లు చేయించుకుంటే.. క‌రోనా అని తేలింది. చాలా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలున్నాయి. భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు'' అని బాలు ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ALSO READ: మ‌హేష్ హీరోయిన్‌కి మంచి ఛాన్స్‌