ఈవారం బాక్ఆసఫీసు దగ్గర సినిమాల మోత మోగింది. గురువారం రాజ రాజ చోర, కనబడుట లేదు, క్రేజీ అంకుల్స్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో క్రేజీ అంకుల్స్ ఇప్పుడు వివాదాన్ని రేపుతోంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’. గాయకుడు మనో కీలక పాత్ర పోషఙంచారు. ఇప్పుడు ఈ సినిమాపై మహిళా సంఘాలు గరమ్ గరమ్ గా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్‌లో మహిళలను కించపరిచేలా డైలాగ్‌లు ఉన్నాయని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ మహిళ హక్కుల వేదిక ఈ సినిమా విడుదలని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్‌లోనే మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు, మహిళలను ఆట వస్తువుగా చూపిస్తూ, అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపొందించడం సరికాదని అన్నారు. ఈ సినిమా ట్రైలర్‌లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చని, గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని, కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతిని కించపర్చడం అన్యాయమన్నారు.
అందుకే ఈ సినిమా నిర్మాత, దర్శకులు, నటీనటులు బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిలిపివేయాలని హెచ్చరించారు. కానీ ఈరోజు ఈ సినిమా విడుదలైపోయింది. సినిమా చూశాక.. ఇంకెన్ని వివాదాలొస్తాయో...?
ALSO READ: 'రాజరాజ చోర' మూవీ రివ్యూ & రేటింగ్!