ENGLISH

శ్రీ‌కారం.. రెండో రోజు - స్లో అండ్ స్ట‌డీ!

14 March 2021-11:40 AM

శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ మోహన్ జంటగా న‌టించిన చిత్రం `శ్రీకారం`.  కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా గురువారం విడుద‌లైంది. తొలి  రోజు మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. వ‌సూళ్లు కూడా బాగానే వ‌చ్చాయి. దాదాపు 4.3 కోట్లు సంపాదించింది. శ‌ర్వా కెరీర్‌లో ఇదే అత్య‌ధిక తొలి రోజు వ‌సూళ్లు.

 

అయితే శుక్ర‌వారం... శ్రీ‌కారం జోరు కాస్త త‌గ్గింది. 1.6 కోట్లు మాత్ర‌మే సంపాదించింది. సాధార‌ణంగా రెండో రోజు వ‌సూళ్ల జోరు కాస్త త‌గ్గుతుంది. శ‌ని, ఆది వీకెండ్ కాబ‌ట్టి.. ఆ రెండు రోజులూ శ్రీ‌కారం మ‌ళ్లీ జోరు చూపించే అవ‌కాశం ఉంది. మొత్తానికి రెండు రోజుల‌కు క‌లిపి దాదాపు 6 కోట్లు సంపాదించింది. మ‌రో రెండు రోజుల్లో 4 కోట్లు తెచ్చుకుంటే.. శ్రీ‌కారం క‌మ‌ర్షియ‌ల్ గానూ గ‌ట్టెక్కిన‌ట్టే.

 

శ్రీ‌కారం రెండు రోజుల వ‌సూళ్ల వివ‌రాలు ఇవీ...


నైజాం : 1.69 కోట్లు
సీడెడ్ : 1.00 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.76 కోట్లు
ఈస్ట్ : 0.54 కోట్లు
వెస్ట్ : 0.34 కోట్లు
గుంటూరు : 0.73 కోట్లు
కృష్ణా : 0.29 కోట్లు
నెల్లూరు : 0.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.18 కోట్లు
ఓవర్సీస్ : 0.25 కోట్లు


2 రోజుల వరల్డ్ వైడ్ టోటల్:  5.98 కోట్లు షేర్

ALSO READ: ప్ర‌భాస్ ప‌క్క‌న స‌రితూగుతుందా?