ENGLISH

శ్రీలీలకి బాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందా?

19 January 2024-09:29 AM

మొన్నటివరకు టాలివుడ్ లో ఏ మూవీలో చూసినా, శ్రీలీలే కనిపించేది. డైరక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోల మొదటి చాయిస్ శ్రీలీలే. కానీ 2023లో శ్రీలీలకి భగవంత్ కేసరి తప్ప హిట్స్ లేవు. ప్రతి నెలకి ఒక సినిమా వస్తోంది. కానీ శ్రీలీల కెరియర్ మాత్రం డౌన్ అవుతోంది.   2023  హ్యాట్రిక్ ఫ్లాపుల‌ను మూట‌గట్టుకుంది. న్యూ ఇయర్ లో వచ్చిన గుంటూరు కారం మూవీ ఒక్క మహేష్ కి తప్ప ఎవరికీ పేరు రాలేదు. మరీ ప్రాధాన్యత లేని పాత్రలు, కేవలం గ్లామర్, డాన్స్ లకే శ్రీలీల పరిమితమవుతోంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకున్న పాపులారిటీని, సక్రమంగా వినియోగించుకోవటం లేదని  నటనకి అవకాశమున్న పాత్రలు చూసుకోకుండా హీరో, డైరక్టర్ చూడకుండా, డజన్లకి పైగా సినిమాలు చేస్తూ ఫ్లాపుల్లో కూరుకుపోయింది.


ఈ   డిజాస్ట‌ర్స్ ఎఫెక్ట్ ఆమె కెరీర్‌పై గ‌ట్టిగానే ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ,  గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ మూవీలో మొదట  శ్రీలీల హీరోయిన్ కాగా, ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లో  రష్మిక వచ్చినట్లు తెలుస్తోంది. ఐఎమ్‌డీబీ సైట్‌లో వీడీ 12 మూవీలో హీరోయిన్‌గా ఇన్నాళ్లు శ్రీలీల పేరు క‌నిపించింది. ఇప్పుడు  ర‌ష్మిక మంద‌న్న పేరు క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రష్మిక యానిమల్ తో భారీ హిట్ కొట్టి  మంచి ఫామ్ లో ఉంది. పైగా విజయ్ రష్మిక జోడికి క్రేజ్ కూడా ఎక్కువ. ఇన్నాళ్లు గోల్డెన్ లెగ్ అనుకున్న  శ్రీలీల ఇప్పుడు ఐరెన్ లెగ్ అయిపోయింది. దీనితో శ్రీలీల వరుస ఆఫర్స్ కోల్పోతోంది.
  

ఇప్పటికైనా శ్రీలీల మేలుకొని, ఆచి తూచి అడుగులు వేస్తూ మంచి కథలని ఎంచుకుంటే నంబర్ వన్ హీరోయిన్ అవటం గ్యారంటీ అంటున్నారు సినీ విశ్లేషకులు. అందం, అభినయం, డాన్స్ అన్ని ఉన్నా కథల ఎంపికలో తడబాటు వల్ల క్రేజ్ పోతోంది అంటున్నారు. ఏదైనా గాని 2023 శ్రీలీలకి మంచి గుణపాఠంగా చెప్పోచ్చు.