ENGLISH

షాకింగ్ డెసిషన్ తీసుకున్న శ్రీలీల

09 March 2024-17:41 PM

ఈ రంగుల ప్రపంచంలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. మరి కొందరు అన్ని ఉన్నా లక్ కలిసిరాక కను మరుగైపోతారు.  కొందరు వచ్చిన అవకాశాలను, పేరుని సక్రమంగా వినియోగించుకుని నంబర్ వన్ స్థానానికి ఎదిగితే, మరికొందరు తప్పుడు నిర్ణయాలతో గోడకి కొట్టిన బంతిలా రివర్స్ అవుతారు. ప్రజంట్ శ్రీ లీల పరిస్థితి కూడా ఇదే.  ఈ కన్నడ కస్తూరి దర్శకేంద్రడు కే. రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన పెళ్లి సందడి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తన అందం, అభినయంతో  పాటు మంచి డాన్సర్ గా గుర్తింపు పొందింది.


మొన్నటి వరకు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే కచ్చితంగా అంతా శ్రీలీలే  అనేవారు. 2023  క్యాలండర్ మొత్తం శ్రీలీల దే. రెండు నెలలకి ఒక సినిమాతో థియేటర్స్ లో సందడి చేసింది. బాలయ్య తో చేసిన భగవంత్ కేసరి ఒక్కటే శ్రీలీలకి ప్రశంసలు తెచ్చి పెట్టింది. మిగతా సినిమాలన్నీ డిజాస్టర్ లే. రామ్ తో  ‘స్కంద’, పంజా వైష్ణవ తేజ్ తో ‘ఆదికేశవ’, నితిన్ తో  ‘ఎక్ట్రాఆర్డినరీ’ సినిమాలు చేసినా ఇవేవి ఆకట్టుకోలేకపోయాయి. 2024  న్యూ ఇయర్ లో  ‘గుంటూరు కారం’ సినిమాతో  పలకరించింది. ఈ మూవీ ఒక్క మహేష్ కి తప్ప ఎవరికీ కలిసి రాలేదు.  ఈ సినిమా పై, త్రివిక్రమ్ పై భారీ అంచనాలు పెట్టుకున్న శ్రీ లీలకి నిరాశ ఎదురయ్యింది.


ఇక తప్పటడుగులు వేయకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యింది అంట. అందుకనే వరుస అవకాశాలు  వస్తున్నా టెంప్ట్ అవకుండా నో చెప్తోందని టాక్.  అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీలో శ్రీలీలకు స్పెషల్ సాంగ్  ఆఫర్ రాగా నో చెప్పిన సంగతి తెలిసిందే. భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్న ఒప్పుకోలేదు. ఇపుడు ఈ సాంగ్ లో జాన్వీ కపూర్  నర్తించనుండటం గమనార్హం. ఇప్పుడు కూడా ఇలాంటి మరో ఆఫర్ వస్తే దానికీ నో చెప్పిందట శ్రీలీల. హీరోయిన్ గా  ఫేమ్ ఉన్న తాను ఐటెం సాంగ్స్ చేస్తే కెరియర్ కి ఎఫెక్ట్ అవుతుందని నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజంట్ చెప్పుకో దగ్గ హిట్స్ లేని కారణంగా, చదువు పై ద్రుష్టి పెట్టి MBBS కంప్లీట్ చేయాలనీ,  ఎగ్జామ్స్  కూడా దగ్గర పడుతుండటంతో ప్రిపరేషన్ మొదలు పెట్టిందని తెలుస్తోంది. తన చదువు పూర్తి అయ్యేవరకు శ్రీలీల మూవీస్ కి బ్రేక్ ఇవ్వాలనుకుంటోంది అని సమాచారం.