ఇటీవల విడుదలైన సినిమా `శ్రీదేవి సోడా సెంటర్`. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకుడు. రివ్యూలు సోసోగా వచ్చాయి. వసూళ్లూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్లైమాక్స్ మరీ `రా` గా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ తరహా క్లైమాక్స్ లు తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా నచ్చవు. అది సినిమా ఫలితంపై ప్రభావం చూపించి ఉండొచ్చు.
సాధారణంగా.. సినిమా లెంగ్త్ కి సరిపడక కొన్ని సన్నివేశాల్ని తొలగిస్తుంటారు. సినిమా విడుదలయ్యాక.. వాటిని యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటారు. శ్రీదేవి సోడా సెంటర్ కి సంబంధించి ఓ సీన్ ఇప్పుడు యూ ట్యూబ్ లో పెట్టారు. అజయ్ - సుధీర్ బాబు మధ్య సాగే సీన్ అది. జైలు లో సుధీర్ ని ఆటపట్టించిన అజయ్... తినే కంచంలో ఉమ్మేస్తాడు. `ఎంగిలి కూడు... బాగుంటుంది తిను` అంటూ రెచ్చగొడతాడు. ఈ సీన్ ని సినిమాలోంచి కత్తిరించి, యూ ట్యూబ్ లో పెట్టారు. ఎమోషన్ పరంగా బాగానే ఉన్నా.. ఇలాంటివి మరీ `రా` సన్నివేశాలు. తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి దూరంగా ఉన్న సీన్లు ఇవి. ఇప్పటికే ఈ సినిమా బాగా రా.. గా ఉంది అంటున్న జనాలకు... ఈ సీన్ అస్సలు ఎక్కకపోవొచ్చు. దాన్ని తొలగించి మంచి పనే చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా డిలీట్ చేసిన సీన్లు... ఈ సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో..?
ALSO READ: చిరుతో కలిసి నటించనున్న గద్దర్