ENGLISH

కేజీఎఫ్ భామ‌తో.. ప్ర‌భాస్ చిందులు!

17 March 2021-09:41 AM

కేజీఎఫ్ తో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయాడు ప్ర‌శాంత్ నీల్. ఇప్పుడు కేజీఎఫ్ 2 సిద్ధ‌మైపోయింది. ఈలోగా.. ప్ర‌భాస్ తో `స‌లార్‌`ని ప‌ట్టాలెక్కించేశాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. అయితే స‌లార్‌లోనూ.. కేజీఎఫ్ సెంటిమెంట్ ని కొన‌సాగిస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్. స‌లార్ లో ఓ అదిరిపోయే ఐటెమ్ గీతం ఉంద‌ట‌. అందులో ప్ర‌భాస్ తో న‌ర్తించేందుకు శ్రీ‌నిధి శెట్టిని రంగంలోకి దించుతున్నాడు ప్ర‌శాంత్ నీల్. శ్రీ‌నిధి శెట్టి ఎవ‌రో కాదు, కేజీఎఫ్‌లో న‌టించిన హీరోయిన్‌.

 

కేజీఎఫ్ చాప్ట‌ర్ 1లో అందంగా క‌నిపించింది. ఆమె పాత్ర‌కు ప్రాధాన్యం త‌క్కువే. అయినా స‌రే - త‌న‌కున్న త‌క్కువ స్క్రీన్ ప్లేస్‌లోనే అల‌రించింది. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2లో మాత్రం త‌న పాత్ర ప‌రిధి పెంచాడ‌ట ప్ర‌శాంత్ నీల్. ఆ సెంటిమెంట్ తోనే.. ఇప్పుడు `స‌లార్‌`లోనూ చోటిచ్చేశాడు. త్వ‌ర‌లోనే ప్రభాస్ - శ్రీ‌నిధిల‌పై ఈ పాట‌ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న స‌లార్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ALSO READ: సెట్స్ పైకి వెళ్తున్న లూసీఫ‌ర్