శ్రీనువైట్ల అనగానే గుర్తుకొచ్చే సినిమాల్లో 'వెంకీ' ముందు వరుసలో వుంటుంది. కల్ట్ ఫాలోయింగ్ సాధించిన సినిమా అది. ముఖ్యంగా అందులో ట్రైన్ సీక్వెన్ ఎవర్ గ్రీన్. రవితేజ అండ్ గ్యాంగ్, బ్రహ్మనందం, ఏవీఎస్, వేణు మాధవ్ పాత్రలు చేసిన సందడి అంతా ఇంత కాదు. తెలుగులో వచ్చిన బెస్ట్ ట్రైన్ జర్నీ కామెడీ అంటే వెంకీ సినిమా అనే చెప్పుచ్చు. అయితే ఇప్పుడు శ్రీనువైట్ల మళ్ళీ అలాంటి ట్రైన్ సీన్స్ పైనే నమ్మకం పెట్టుకున్నారు.
గోపీచంద్ తో విశ్వం సినిమా తీసుకున్నారు వైట్ల. సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. యాక్షన్ తో పాటు వినోదం కూడా వున్న సినిమా ఇది. ఇందులో ఒక ట్రైన్ సీక్వెన్స్ వుంది. చాలా మంది హాస్యనటులు ఇందులో కనిపిస్తారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో కొన్ని షాట్స్ ఫ్లాష్ లా వెలిగాయి. వెంకీలానే కాస్త లెన్తీగా వుండే ఈ సీక్వెన్స్ లో కామెడీ పండితే ఎంటర్ టైన్మెంట్ పరంగా సినిమా హిట్టుకొట్టడం ఖాయమని వినిపిస్తోంది. మరి ఈ సీక్వెన్స్ ఏ రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.