ENGLISH

Mahesh Babu: మ‌హేష్‌కి హీరోయిన్ ఇంకా దొర‌క‌లేదు

15 July 2022-15:00 PM

మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ కాంబో ఎప్పుడో సెట్ట‌య్యింది. వ‌చ్చే నెల‌లో షూటింగ్ కూడా మొద‌లు కానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డేని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. అయితే.. మ‌రో హీరోయిన్ కూడా కావ‌ల్సివుంది. ఆ పాత్ర‌లో.., పెళ్లి సంద‌డి హీరోయిన్ శ్రీ‌లీలని ఎంచుకొన్నార‌ని అనుకొన్నారు. కానీ.. శ్రీ‌లీల ఇంకా ఖ‌రారు కాలేద‌ని స‌మాచారం. అంటే.. సెకండ్ హీరోయిన్ ఆప్ష‌న్ ఇంకా పెండింగ్‌లోనే ఉంద‌న్న‌మాట‌. షూటింగ్ కి ఇంకా ఎన్నో రోజుల స‌మ‌యం లేదు. క‌థ‌లో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా చాలా కీల‌కం. అందుకే ఆ హీరోయిన్ ని ఫిక్స్ చేసే విష‌యంలో చిత్ర‌బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

 

ఇటీవ‌లే ముంబై లో ఈ సినిమాకి సంబంధించిన ఆడిష‌న్స్ చేశార‌ని, అయితే.. ఏ ఒక్క‌రూ సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో... సెకండ్ హీరోయిన్ స్థానం భ‌ర్తీ కాకుండా ఉండిపోయింద‌ని తెలుస్తోంది. మ‌ల‌యాళం నుంచి వ‌స్తున్న కొత్త హీరోయిన్ల‌ని ప‌రిశీలించినా.. మ‌హేష్ ప‌క్క‌న వాళ్లెవ‌కూ సెట్ కావ‌డం లేద‌ట‌. దాంతో.. మ‌హేష్ తో ఇప్ప‌టికే న‌టించిన‌వాళ్ల‌లో ఎవ‌రినైనా తీసుకుంటే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న చేస్తున్నారు. ఈ వారంలో.. సెకండ్ హీరోయిన్‌ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఖాయం చేయాల‌ని త్రివిక్ర‌మ్ డిసైడ్ అయ్యాడ‌ట‌. మ‌రి.. ఆ ఛాన్స్ ఎవ‌రికి వ‌స్తుందో చూడాలి.

ALSO READ: 'గార్గి' మూవీ రివ్యూ& రేటింగ్!