ENGLISH

SSMB28: స‌గం డ‌బ్బులు నెట్ ఫ్లిక్స్ ఇచ్చేసింది

01 February 2023-12:06 PM

మ‌హేష్‌బాబు - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెల‌సిందే. అనేక వాయిదాలూ, ఆల‌స్యాల పిద‌ప ఇటీవ‌లే సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ సినిమాకి మామూలు క్రేజ్ లేదు. షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. రూ.81 కోట్ల‌కు నెట్ ఫ్లిక్స్‌.. ఓటీటీ రైట్స్ ద‌క్కించుకొంది. తెలుగు సినిమాల్లో ఇదే రికార్డ్‌.

 

మ‌హేష్ బాబుకి ఈ సినిమా కోసం రూ.60 కోట్ల పారితోషికం ఇచ్చారు. పూజా హెగ్డేకి రూ.4 కోట్లు, త‌మ‌న్ కి రూ.4 కోట్లు పారితోషికంగా కేటాయించారు. అంటే... రూ.68 కోట్లు. నెట్ ఫ్లిక్స్ ద్వారా వీరంద‌రి పారితోషికాలు ఇచ్చేయొచ్చ‌న్న‌మాట‌. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.150 కోట్లంటే... స‌గానికి పైగా డ‌బ్బులు ఓటీటీ రూపంలోనే వ‌చ్చేశాయ్‌. థియేట‌ర్ ద‌గ్గ‌ర క‌నీసం రూ.120 కోట్ల బిజినెస్ చేయ‌గ‌ల స‌త్తా ఈ సినిమాకి ఉంది. అంటే ఎలా చూసినా.. రూ.50 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ఈ సినిమా ద‌క్కించుకొంటుంద‌న్న‌మాట‌. ఓ పెద్ద సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ఇంత టేబుల్ ప్రాఫిట్ చూడ‌డం నిజంగా అద్భుత‌మే. మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ సినిమాకున్న క్రేజ్‌కి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి?