ENGLISH

కృష్ణగారి బర్త్ డే కే మహేష్ టైటిల్

28 March 2023-09:29 AM

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ, ఫస్ట్ లుక్ ని తాజాగా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అయితే మహేష్ ఫ్యాన్స్ టైటిల్ కూడా వస్తుందని ఆశపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు నిర్మాత నాగవంశీ మరో అప్డేట్ ఉంటుదని చెప్పారు.

 

‘‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ అప్‌డేట్‌తో మీరంతా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నా. తర్వాత హైపర్‌ మాసీ అప్‌డేట్‌.. కృష్ణగారి జయంతి సందర్భంగా మే 31న వస్తుంది. అప్పటివరకూ ఓపికతో ఉంటారని భావిస్తున్నా’’ అని నాగవంశీ ట్వీట్‌ చేశారు. సో.. 31న వచ్చే అప్డేట్ టైటిల్ అయ్యింటుదని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారుకాని ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజాహెగ్డే, శ్రీలీల సందడి చేస్తున్నారు.