ENGLISH

తెర‌పైకి చంద్ర‌బాబు - వైఎస్సార్‌ల క‌థ

11 August 2020-17:00 PM

చంద్ర‌బాబు - వైఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. ఇద్ద‌రూ స‌మ‌కాలీన రాజ‌కీయ నేత‌లే. ఒక‌రు అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రొక‌రు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. తెలుగు రాజ‌కీయాల్ని త‌మదైన శైలిలో ప్ర‌భావితం చేశారు. అన్నింటికంటే మించి.. ఇద్ద‌రూ మంచి మిత్రులు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. సిద్ధాంతాలు వేరు ప‌డి, వాటిపై పోరాటం చేశారు కానీ, ఇద్ద‌రూ ఎప్పుడు క‌లుసుకున్నా - రాజ‌కీయాల‌కు అతీతంగా త‌మ స్నేహ‌త‌త్వం ప్ర‌ద‌ర్శించేవారు. ఇప్పుడు వీరిద్ద‌రి స్నేహంపై ఓ వెబ్ సిరీస్ రాబోతోంది.

`చ‌ద‌రంగం` అనే వెబ్ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చ‌క్ర‌.. ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ క‌థ ప‌ట్టాలెక్క‌బోతోంది. న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. చ‌ద‌రంగం వెబ్ సిరీస్ లో తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన న‌టీన‌టులే ఎక్కువ‌గా క‌నిపించారు. ఈసారీ.. అంతేన‌ట‌. అయితే స‌రిగ్గా ఇలాంటి స్టోరీ లైన్ తోనే.. ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా ఓ వెబ్ సిరీస్ రూపొందించాల‌నుకున్నార్ట‌. త‌న స్టోరీ లైన్‌కి కాపీ కొడుతున్నార‌ని, ఇలా కాపీ కొట్టేవారిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌ద‌ల‌న‌ని ఆయ‌న వార్నింగ్ ఇస్తున్నారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి క‌థ ముందుగా ప‌ట్టాలెక్కుతుందో చూడాలి.

ALSO READ: చిరు చేసిన త‌ప్పేంటి?