ENGLISH

'ఆర్య 3'... ఈ 'రౌడీ'తోనా?

19 October 2021-15:00 PM

సుకుమార్ జ‌ర్నీ `ఆర్య‌`తో ప్రారంభ‌మైంది. ఫీల్ మై ల‌వ్ అంటూ కొత్త ప్రేమ‌కథ‌ని వినిపించాడు ఆర్య‌. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అప్ప‌టి నుంచీ... సుకుమార్ దిగ్విజ‌య యాత్ర నిరాటంకంగా కొన‌సాగుతోంది. ఇప్పుడు టాలీవుడ్ లోనే తాను క్రేజియ‌స్ట్ డైరెక్ట‌ర్‌. ఆర్య టైటిల్ పై సుకుమార్ కి చాలా ప్రేమ‌. అందుకే ఆర్య 2 తీశాడు. త్వ‌ర‌లోనే ఆర్య 3 కూడా చేయ‌బోతున్నా అని ప్ర‌క‌టించాడు.

 

అయితే ఈసారి ఆర్య అల్లు అర్జున్ కాదు. విజ‌య్ దేవ‌ర‌కొండ అని స‌మాచారం. ఎందుకంటే... విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ ఓ సినిమా చేయాలి. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ సినిమాని ప‌క్క‌న పెట్టి, పుష్ష ప‌ట్టాలెక్కించాడు సుకుమార్‌. పుష్ష 2 అయ్యేసరికి విజ‌య్ దేవ‌రకొండ అందుబాటులోకి వ‌చ్చేస్తాడు. త‌న‌తో ఓసినిమా ప‌క్కాగా చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. విజయ్ దేవ‌ర‌కొండ కోసం సుకుమార్ మ‌రో క‌థ రాసుకున్నా, త‌న‌కు ఆర్య లాంటి కాన్సెప్ట్ అయితే బాగుంటుంద‌ని ఫీల్ అవుతున్నాడ‌ట‌. ఓ వెరైటీ ప్రేమ‌క‌థ‌ని విజ‌య్ తో చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ని, బ‌న్నీ కోసం సిద్ధం చేసుకున్న ఆర్య 3ని... ఈసారి రౌడీతో లాగించేసే అవ‌కాశాలు మొండుగా ఉన్నాయ‌ని టాలీవుడ్ టాక్‌.

ALSO READ: హిట్ కి ఎంత దూరంలో ఉన్నాడు?