ENGLISH

త్రివిక్ర‌మ్‌ని దాటేసిన సుకుమార్‌?

13 August 2020-18:00 PM

టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే... రాజ‌మౌళి పేరే చెబుతారు. టాలీవుడ్ అనేంటి? ఇండియాలోనే అత్య‌ధిక పారితోషికం అందుకునే ద‌ర్శ‌కుల‌లో ఆయ‌న పేరు ముందు వ‌రుస‌లోనే ఉంటుంది. రాజ‌మౌళి త‌రువాతి స్థానం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ దే. ఆయ‌న పారితోషికంతో పాటు సినిమాల్లో వాటా కూడా అందుకుంటార‌ని తెలుస్తోంది. అల వైకుంఠ‌పుర‌ములోకి గానూ.. ఆయ‌న పారితోషికం ఇంచుమించుగా 20 కోట్ల వ‌ర‌కూ ఉంద‌ని టాక్‌.  తాజాగా ఎన్టీఆర్ సినిమాకీ అంతే అందుకున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ రికార్డుని ఇప్పుడు సుకుమార్ బ్రేక్ చేశాడ‌ని తెలుస్తోంది.

రంగ‌స్థ‌లం త‌ర‌వాత‌.. సుకుమార్ మ‌రింత క్రేజీ డైరెక్ట‌ర్ అయిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ని `పుష్ఫ‌`గా చూపించ‌బోతున్నాడు. ఈసినిమాకి గానూ సుకుమార్ దాదాపు 22 కోట్ల పారితోషికం తీసుకున్నాడ‌ని టాక్‌. ఆ లెక్క‌న‌.. సుకుమార్ త్రివిక్ర‌మ్ ని దాటేసిన‌ట్టే. కొర‌టాల శివ పారితోషికం కూడా ఇంచుమించుగా 20 కోట్ల‌ని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ టాప్ 4 ద‌ర్శ‌కుల‌లో వ‌రుస‌గా రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, కొర‌టాల‌, సుకుమార్ ఉన్నారు. వాళ్లకే అత్య‌ధిక పారితోషికం కూడా అందుతోంది.

ALSO READ: 'ఈగ‌'ని కాపీ కొట్టిన రాజ‌మౌళి శిష్యుడు