ENGLISH

పుష్ప కథతో నెట్ ఫ్లిక్స్ లో సుక్కు డాక్యుమెంటరీ

12 December 2024-19:51 PM

పుష్ప 2 మూవీతో బన్నీతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు సుకుమార్. సుకుమారంటే ఇప్పడు కేవలం టాలీవుడ్ దర్శకుడు మాత్రమే కాదు పాన్ వరల్డ్ డైరక్టర్. సుక్కు మేకింగ్ కి బన్నీ యాక్టింగ్ యాడ్ అయ్యి కలక్షన్ల సునామి సృష్టిస్తోంది పుష్ప 2. నార్త్, సౌత్, ఓవర్సిస్ లో కొత్త లెక్కలు రాస్తోంది. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల లోపే వెయ్యి కోట్లు మార్క్ దాటేసింది. దీనితో సుక్కు రేంజ్ మరింత పెరిగింది. నెక్స్ట్ సుకుమార్ ఎవరితో వర్క్ చేస్తాడు అన్న ఆసక్తి పెరిగింది. పుష్ప 2 తరువాత సుకుమార్ చరణ్ తో వర్క్ చేస్తాడని ప్రచారం జరిగింది. చరణ్ కూడా అప్పటికి RC16 కంప్లీట్ చేసి సుక్కు ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడని అనుకున్నారంతా. కానీ సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చెర్రీతో కాదంట.

చెర్రీతో వర్క్ చేయటానికి కంటే ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఒక డాక్యుమెంటరీ చేయనున్నారని టాక్. ట్విస్ట్ ఏంటి అంటే అది కూడా 'పుష్ప' స్టోరీ. అదేంటి ఇప్పటికే రెండు పార్ట్ లు తీశారు. ఇంకా మూడో పార్ట్ ఉంది. మళ్ళీ పుష్ప స్టోరీ ఏంటి అనుకుంటున్నారా? పుష్ప మూవీకి వర్క్ చేస్తున్నపుడు సుకుమార్ చాలా రీసెర్చ్ చేసారంట.  గంధపుచెట్లు పెంపకం, ఎగుమతి, అక్రమ రవాణా, అసలు ఎక్కడికి ఎలా ఎక్స్ పోర్ట్ అవుతాయి. గంధపు చెక్కలు దేనికి వాడతారు అనే పలు విషయాల గురించి తెలుసుకున్నారట. 'పుష్ప 2' లో కొంత మ్యాటర్ యూజ్ చేసి, మిగతా విషయాలు ఊరికినే వదిలేసారట.

కష్టపడి సేకరించిన విషయాలు అలా నిరర్థకంగా పడేయటం ఎందుకని నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం ఉపయోగిస్తున్నారు. మొదటి నుంచి గంధపు చెక్కలు స్మగ్లింగ్ పై ఆసక్తి ఉన్నా. సినిమాలు వచ్చినా పుష్ప రాజ్ మరింత క్రేజ్ పెంచాడు. ఆ క్రేజ్ దృష్ట్యా డాక్యుమెంటరీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇండియాలో చిత్తూరు ఏరియాల్లో దొరికే గంధపు చెట్లకి ఫుల్ డిమాండ్ ఉంది. అన్ని రాష్ట్రాలనుంచి వచ్చి ఇక్కడ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తారని ఇవన్నీ సుకుమార్ డాక్యుమెంటరీలో చూపిస్తారని సమాచారం.