ENGLISH

దుల్క‌ర్ సినిమ‌లో అక్కినేని హీరో

13 July 2021-14:06 PM

మ‌ళ్లీ రావాతో ఓ హిట్ అందుకున్నాడు సుమంత్. అయితే ఆ త‌ర‌వాత మ‌ళ్లీ మామూలే. త‌న కెరీర్ మ‌రోసారి డైలామాలో ప‌డిపోయింది. ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలో తెలీక గంద‌ర‌గోళ ప‌డుతున్నాడు. ప్రస్తుతం ఒక‌ట్రెండు సినిమాల్లో హీరోగా న‌టిస్తున్నాడు. దాంతో పాటుగా ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నాడు. క‌థ న‌చ్చితే.. మ‌రో హీరో సినిమాలో కీ రోల్స్ చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించాడు. దానికి త‌గ్గ‌ట్టుగానే... ఓ సినిమాలో హీరోకి స్నేహితుడిగా న‌టించ‌డానికి రెడీ అనేశాడ‌ట‌.

 

దుల్కర్ సల్మాన్ క‌థానాయ‌కుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 1964 బ్యాక్ డ్రాప్ లో సాగే ఆర్మీ – లవ్ స్టోరీలో సాగే చిత్ర‌మిది. ఈ సినిమాలో దుల్కర్ స్నేహితుడిగా కీలక పాత్రలో సుమంత్ నటించనున్నాడని తెలుస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుం హైదరాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ సెట్ వేసి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ALSO READ: క‌త్తి మ‌హేష్ మృతిపై అనుమానాలు.. విచార‌ణ‌కి డిమాండ్‌