ENGLISH

ఓటీటీలో 'గ‌ల్లీ రౌడీ'

01 July 2021-15:00 PM

లాక్ డౌన్ నిబంధ‌న‌లు న‌డ‌లినా, థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ల‌భించినా - నిర్మాత‌లు అందుకు ధైర్యం చేయ‌డం లేదు. ఆగ‌స్టు వ‌ర‌కూ కొత్త సినిమాలు వ‌చ్చే ఛాన్సు లేద‌ని తేలిపోయింది. ఆ త‌ర‌వాత‌.. కూడా నిర్మాత‌లు ప‌రిస్థితుల్ని బ‌ట్టే ముందుకు వెళ్తారు. అందుకే... ఇప్పుడు ఓటీటీల‌కు మ‌ళ్లీ ఊపొచ్చింది. నార‌ప్ప‌, దృశ్యం లాంటి సినిమాలు ఓటీటీలోకి వెళ్ల‌బోతున్నాయంటూ వార్త‌లొచ్చాయి. ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఓటీటీ బాట‌లోకి వెళ్ల‌బోతోంది. అదే... `గ‌ల్లీ రౌడీ`.

 

సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడు. షూటింగ్ పూర్త‌య్యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నార‌ని, అమేజాన్‌,ఆహాల‌తో నిర్మాత‌లు సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. దాదాపు రూ.6 కోట్ల‌కు ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని, త్వ‌ర‌లోనే నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

ALSO READ: 'ఛ‌త్ర‌ప‌తి'.. తెలుగులో కూడా