ENGLISH

సందీప్ కిష‌న్ హిట్టు కొట్టేస్తాడా!

08 March 2017-18:34 PM

సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన న‌గరం ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. తెలుగు, త‌మిళ భాషల్లో రూపొందించిన ఈ చిత్రంలో శ్రీ‌, రెజీనా కీల‌క పాత్రలు పోషించారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌కుడు. ఈరోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో న‌గ‌రం ప్రివ్యూ షో ప్ర‌ద‌ర్శించారు. టాక్ పాజిటీవ్ గానే వ‌స్తోంది. ఇదో కొత్త‌ర‌కం సినిమా అనీ, స్ర్కీన్ ప్లే బాగుంద‌ని, ద‌ర్శ‌కుడు చాలా క్లిష్ట‌మైన‌ క‌థని స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేశాడని ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. సందీప్ కిష‌న్ రోల్ కూడా చాలా డిఫ‌రెంట్‌గా ఉంద‌ని, న‌గ‌రంతో మ‌రో వెరైటీ సినిమా సందీప్ కిష‌న్ ఖాతాలో ప‌డిపోయింద‌ని చెబుతున్నారు. ఈ వారం దాదాపు అర‌డ‌జ‌ను సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అయితే... చిత్రంగ‌ద‌, న‌గ‌రం సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ ఉంది. విడుద‌ల‌కు ముందే.. న‌గ‌రం పాజిటీవ్ బ‌జ్ తెచ్చుకోవ‌డం సందీప్‌కి క‌లిసొచ్చే విష‌య‌మే. మ‌రి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో చూడాలి. న‌గ‌రం తెలుగు రివ్యూ కోసం... బ్రౌజ్ చేస్తూనే ఉండండి!