ENGLISH

'ఉంగరాల రాంబాబు' వచ్చేస్తున్నాడోచ్‌

01 September 2017-18:12 PM

'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'ఉంగరాల రాంబాబు'. 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' సినిమాలో క్యూట్‌ లవ్‌ స్టోరీని చాలా డిఫరెంట్‌గా మనసుకు హత్తుకునేలా చూపించి సక్సెస్‌ అయ్యాడు క్రాంతి మాధవ్‌. ఇప్పుడు సునీల్‌ హీరోగా 'ఉంగరాల రాంబాబు' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వినోదానికి పెద్ద పీట వేశారట. సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా కామెడీ పంచ్‌లు అదిరిపోతాయట. సునీల్‌కి జంటగా మియా జార్జ్‌ నటిస్తోంది. కామెడీ సినిమానే అయినప్పటికీ, ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌. సునీల్‌ గత చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటుంది. తనకు బలమైన కామెడీ జోనర్‌లో సునీల్‌ చేస్తోన్న ఈ మూవీతో మళ్ళీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలనుకుంటున్నాడు. ఈ మధ్య సునీల్‌ నటించిన మూడు చిత్రాలు వరుసగా నిరాశ పరిచాయి. దాంతో కొంచెం గ్యాప్‌ తీసుకున్నాడు నవ్వుల రాజు సునీల్‌. ఈ సారి ఫ్యాన్స్‌ని అస్సలు నిరాశ పరచనంటూ నమ్మకంగా చెబుతున్నాడు. ఈ సినిమాలో జాతకాల పిచ్చి ఉన్న కుర్రాడిలా నటిస్తున్నాడు సునీల్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, యాక్షన్‌ కూడా అదరగొట్టేస్తాడట. అయితే మరీ సిక్స్‌ ప్యాక్‌ యాక్షన్‌ కాదు కానీ, యాక్షన్‌ అయితే చేస్తాడట. మరింకెందుకాలస్యం మన ఉంగరాల రాంబాబు' త్వరలోనే నవ్వులు పంచడానికి దూసుకొచ్చేస్తున్నాడు. సెప్టెంబర్‌ 15న 'ఉంగరాల రాంబాబు' ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.