ENGLISH

ఆ ఫిగర్‌ చూస్తే షాకవ్వాల్సిందేనట

14 March 2017-16:27 PM

'రోగ్‌' సినిమా ఫంక్షన్‌ కోసం సన్నీలియోన్‌ని తీసుకొచ్చారు. ఊరికే వస్తుందా ఈ ముద్దుగుమ్మ. ఆమెని ఈ ఫంక్షన్‌కి తీసుకురావడానికి చాలా పెద్ద మొత్తం వెచ్చించారట. ఎంత వెచ్చించినా, ఆ ఖర్చుకి న్యాయం జరిగితేనే గొప్ప. సన్నీలియోన్‌ని అలా తీసుకురావడం ద్వారా గొప్ప పనే చేశారనే ప్రశంసల్ని అందుకుంటోంది 'రోగ్‌' టీమ్‌. ఎందుకంటే నిన్న జరిగిన ఫంక్షన్‌లో సన్నీలియోన్‌ చేసిన డాన్స్‌ ఆ రేంజ్‌లో ఉంది మరి. డాన్స్‌తో పాటు ఆమె ప్రదర్శించిన ఎనర్జీ అబ్బో అద్భుతం. ఎక్స్‌పోజింగ్‌ తప్ప ఏమీ చేతకాదని సన్నీలియోన్‌ గురించి ఓ విమర్శ ఉంది. కానీ ఎనర్జీతో డాన్స్‌ చేసి స్వీట్‌ షాక్‌ ఇచ్చింది సన్నీలియోన్‌. ఎక్స్‌పోజింగ్‌ లేకుండానే రకరకాల కాస్ట్యూమ్స్‌లో సన్నీలియోన్‌ స్టేజ్‌ మీద అలా మెరిసిపోతోంటే అవాక్కయి చూశారంతా. ఇంత కష్టపడి సన్నీలియోన్‌ స్టేజ్‌ మీద ప్రదర్శన ఇచ్చిందంటే చాలా ఎక్కువ మొత్తమే తీసుకుని ఉండాలి. అదెంతో ఇప్పటికైతే సస్పెన్సే. మొత్తానికి 'రోగ్‌' టీం పుణ్యమా అని హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌తో కిక్కెక్కించే డాన్స్‌ షో ఇప్పించేశారు. ఇకపోతే పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న 'రోగ్‌' చిత్రంపై భారీగా అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా పబ్లిసిటీ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. హీరో ఇషాన్‌కి ఇది తొలి సినిమానే అయినా, విడుదలకి ముందే స్టార్‌డమ్‌ దక్కించుకునేలా వున్నాడు.

ALSO READ: చ‌లానా కింగ్‌.. రామ్ చ‌ర‌ణ్‌!