ENGLISH

సూప‌ర్ స్టార్ బ‌యోపిక్‌.. ఆన్ ద వే!

10 May 2022-11:24 AM

బ‌యోపిక్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. సినీ స్టార్ బ‌యోపిక్ అయితే అది హాట్ కేక్‌. అందులో బోలెడ‌న్ని క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్స్ ఉంటాయి. పైగా.. ఆస‌క్తి కూడా. ఆ కోవ‌లో.. సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ ఇప్పుడు వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ బ‌యోపిక్‌పై మ‌హేష్‌బాబు మాట్లాడ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ క‌థ‌ని.. `మేజ‌ర్‌` పేరుతో తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అడ‌వి శేష్ హీరోగా న‌టించాడు. ఈ సినిమాకి మ‌హేష్ నిర్మాణ భాగ‌స్వామిగా ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా కృష్ణ బ‌యోపిక్ తీసే అవ‌కాశం ఉందా? అనే ప్ర‌శ్న వ‌చ్చింది. దానికి మ‌హేష్ సానుకూలంగానే స్పందించాడు.

 

``నాన్న‌గారి బ‌యోపిక్ నాక్కూడా చూడాల‌ని ఉంది. అందులో నేను న‌టించ‌ను. కానీ... నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తా.`` అని ప‌చ్చ‌జెండా ఊపేశాడు మ‌హేష్‌. నిర్మాత దొరికేశాడు కాబట్టి.. ఇప్పుడు స్క్రిప్టులు రెడీ చేసుకునే ఛాన్స్ ఉంది. కృష్ణ జీవితం.. సాహ‌సాల మ‌యం. తెలుగు చిత్ర‌సీమ అభివృద్దిలో ఘ‌ట్ట‌మ‌నేనిది కీల‌క‌మైన ఘ‌ట్టం. ఆయ‌న చేసిన ప్ర‌యోగాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సూప‌ర్ స్టార్ గా ఎదిగిన వైనం అంద‌రికీ ఆద‌ర్శం. ఆయ‌న క‌థ సినిమాగా వ‌స్తే సూప‌ర్ హిట్టే. కానీ కృష్ణ‌లా న‌టించే హీరో ఎవ‌ర‌న్న‌దే ప్ర‌శ్న‌.

ALSO READ: నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే : మహేష్ బాబు