ENGLISH

కూతురికీ కోపం వచ్చేసింది

03 March 2021-17:45 PM

ఈమ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఓ వార్త బాగా చ‌క్క‌ర్లు కొట్టింది. న‌టి సురేఖా వాణి.. రెండో పెళ్లి చేసుకోబోతోంద‌న్న‌ది ఆ వార్త‌ల సారాంశం. దీనిపై సురేఖావాణి ఇది వ‌ర‌కే క్లారిటీ ఇచ్చింది. త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌ని, ఆ వార్త‌ల‌న్నీ నిరాధార‌మైన‌వ‌ని తేల్చేసింది. అప్ప‌టి నుంచీ.. ఆ గాసిప్పుల‌కు పుల్ స్టాప్ ప‌డిపోయింది. అయితే.. సురేఖా వాణి కుమార్తె.. సుప్రీత‌కు మాత్రం ఆ కోపం ఇంకా చ‌ల్లార లేదు. ఇన్‌స్ట్రా వేదిక‌గా.. అలాంటి వార్త‌లు రాసేవాళ్ల‌ని చీల్చి చండాడింది.

 

‘ఉన్న న్యూస్‌ చెప్పండి. కొత్తగా క్రియేట్‌ చేయకండి. కనీసం మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అని చెప్పుకోకండి. ఆదాయం కోసం ఒక వ్యక్తి పరువు, ప్రతిష్టను ఎలా నాశనం చేస్తారు’’ అంటూ.. ఫైర్ అయిపోయింది. 2019లో సురేఖావాణి త‌న భ‌ర్త‌ని కోల్పోయింది. అప్ప‌టి నుంచే కూతురే ప్రాణంగా బ‌తుకుతోంది. ఇద్ద‌రి ఫొటోలూ, వీడియోలూ సోష‌ల్ మీడియాలో బాగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సుప్రీత కూడా త్వ‌ర‌లో హీరోయిన్ అవుతుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై త‌ల్లీకూతుర్లు ఏమంటారో మ‌రి.

ALSO READ: మ‌సాలా ఎఫెక్ట్... రామ వ‌ణికిపోతున్నాడు