ENGLISH

చర‌ణ్‌కి విల‌న్ దొరికేశాడు

27 October 2021-10:42 AM

రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. కైరా అద్వాణీ క‌థానాయిక‌. దిల్ రాజు నిర్మాత‌. సాధార‌ణంగా త‌న సినిమాల్లో విల‌న్ పాత్ర‌ల‌కు చాలా ప్రాధాన్యం ఇస్తుంటాడు శంక‌ర్‌. అందుకోసం స్టార్ల‌ని రంగంలోకి దింపుతుంటాడు. మ‌రి ఈ సినిమా కోసం ఎవ‌రిని విల‌న్ గా మార్చ‌బోతున్నాడు? అనే ఆస‌క్తి అంత‌టా నెల‌కొంది. ఇప్పుడు ఈ ప్ర‌శ్నకు స‌మాధానం దొరికేసింది. చ‌ర‌ణ్ తో ఢీ కొట్టే న‌టుడు ఎవ‌ర‌న్న‌ది తెలిసిపోయింది.

 

ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా సురేష్ గోపీని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల శంక‌ర్ - సురేష్ గోపీల మ‌ధ్య భేటీ జ‌రిగింద‌ట‌. క‌థ‌, అందులోని త‌న పాత్ర న‌చ్చి, వెంట‌నే ఈసినిమా చేయ‌డానికి సురేష్ గోపీ అంగీక‌రించార‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం సురేష్ గోపీ భారీ మొత్తంలో పారితోషికం అందుకోబోతున్నార్ట‌. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావాల్సివుంది. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్ కేటాయించ‌బోతున్న‌ట్టు టాక్‌. అందులో దాదాపు 100 కోట్లు పారితోషికాల‌కే అయ్యేట్టు ఉంద‌ని తెలుస్తోంది.

ALSO READ: 'పుష్ష‌' ఈసారి త‌గ్గాల్సిందేనా?