ENGLISH

దీపావళి కానుకగా సూర్య 36 'NGK'

23 July 2018-12:42 PM

'గజిని', 'సింగం' సిరీస్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకున్న హీరో సూర్య 36వ చిత్రంగా రూపొందుతున్న 'NGK' (నంద గోపాలకృష్ణ)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

'7జి బృందావన్ కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరాఘవ దర్శకత్వంలో, రీసెంట్‌గా 'ఖాకి' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై 'NGK' (నంద గోపాలకృష్ణ) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం సెకండ్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో సూర్య పుట్టినరోజు(జూలై 23) సందర్భంగా విడుదల చేశారు. సూర్య సరసన సాయి పల్లవి, రకుల్‌ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. 

- ప్రెస్ రిలీజ్

ALSO READ: బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళిపోయిన వారికి మరో ఛాన్స్