ENGLISH

Suriya: ఇప్పుడు సూర్య కూడా దిగిపోయాడు!

18 July 2022-11:02 AM

త‌మిళ హీరోలు టాలీవుడ్ ఇండ‌స్ట్రీపై దృష్టి పెడుతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్‌, శివ‌కార్తికేయ‌న్‌, ధ‌నుష్‌.. ఇలా వ‌రుస‌గా తెలుగులో సినిమాలు చేసేస్తున్నారు. శివ‌కార్తికేయ‌న్‌, ధ‌నుష్ చేతుల్లో అయితే రెండేసి సినిమాలున్నాయి. ఇప్పుడు సూర్య కూడా ఇదే బాట ప‌ట్టాడు. త‌మిళంలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకొన్నాడు సూర్య‌. తెలుగులో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. సూర్య - త్రివిక్ర‌మ్‌, సూర్య - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్లో సినిమాలు వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అవి కుద‌ర్లేదు. ఎట్ట‌కేల‌కు సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఖారారైపోయింది.

 

సూర్య‌తో.. యూవీ క్రియేష‌న్స్ ఓ సినిమా చేయ‌బోతోంది. `శౌర్యం` శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి తెర‌కెక్కిస్తారు. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

 

అయితే సూర్య చేతిలో చాలా సినిమాలున్నాయి. బాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు సూర్య‌. సుధా కొంగ‌ర కూడా ఓ క‌థ సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. అవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చేంత వ‌ర‌కూ శివ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌దు.

ALSO READ: నిర్మాత‌లే స‌మ్మె చేస్తే.. మ‌నుగ‌డ ఎలా?