ENGLISH

Sushmita: తండ్రి కోసం కథల వేటలో మెగా డాటర్

16 January 2023-12:00 PM

కాస్ట్యుమ్ డిజైనర్ గా పని చేస్తోంది మెగాడాటర్ సుస్మిత. చిరంజీవి సినిమాలన్నిటికీ ఆమెనే కాస్ట్యుమ్ డిజైనర్. తాజాగా వాల్తేరు వీరయ్య కాస్ట్యుమ్ కి మంచి పేరు వచ్చింది. మరోవైపు నిర్మాతగా కూడా వుంటుంది. ఎక్కువగా డిజిటల్ కంటెంట్ పై ద్రుష్టి పెడుతుంది. మరి చిరంజీవి తో సినిమా చేసే ఆలోచన లేదా అంటే.. తప్పకుండా చేస్తానని చెబుతుంది సుస్మిత.

 

''నాన్నగారు లాంటి స్టార్ తో పని చేయాలనీ అందరి నిర్మాతలకు వుంటుంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే నాకు కూడా ‘’ముందు మంచి కథ తీసుకురా వెంటనే చేద్దాం’’ అంటారు. మేము కూడా ఆయన కోసం కథ వేటలోనే వున్నాం. మంచి కథ కుదిరితే నాన్నతో తప్పకుండా సినిమా చేస్తా'' అని చెప్పుకొచ్చింది సుస్మిత. ప్రస్తుతం ఆమె చిరంజీవి భోళా శంకర్ సినిమాకి డిజైనర్ గా పని చేస్తున్నారు