ENGLISH

'సైరా నరసింహారెడ్డి' బడ్జెట్‌ ఎంత?

24 August 2017-16:59 PM

చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి'కి కాస్టింగ్‌ వేల్యూ చాలా ఎక్కువే. కాస్టింగ్‌ విషయంలో ఇంతవరకూ గాసిప్స్‌గా ప్రచారమైన న్యూస్‌ అన్నీ వాస్తవాలే. బిగ్‌బీ అమితాబ్‌ ఈ సినిమాలో నటించనున్నారన్న విషయంలో సస్పెన్స్‌ తీరిపోయింది. అలాగే హీరోయిన్‌ నయనతార విషయంలో కూడా. ఇక పోతే అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోంది ఈ చిత్రం అన్న సంగతి తెలిసిందే. చరణ్‌ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. సో అంచనాలకు మించే ఉంటుంది కానీ, ఏమాత్రం తక్కువ కాదు. హాలీవుడ్‌లో 'స్పైడర్‌మేన్‌' సినిమాకి యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా చేసిన టోనీని ఈ సినిమా కోసం టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారంటేనే అర్ధం చేసుకోవాలి. ఈ సినిమాలో పోరాట ఘట్టాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో. మోషన్‌ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేశారు. ఇక బడ్జెట్‌ విషయంలో కూడా చరణ్‌ చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌ అని మాత్రమే తెలుస్తోంది కానీ, లెక్కలు ఇంకా రివీల్‌ కాలేదు. చరణ్‌ నిర్మాణం కదా.. చరణ్‌కి చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కల్ని ఊహించడం అంత సులభం కాదు. తన కొడుకని కాదు కానీ, అందుకే చిరంజీవి కూడా అన్నారు.. ఇలాంటి సినిమా చేయాలంటే సొమ్ములు కాదు, దమ్ములుండాలి అని. ఆ దమ్ము ఒన్‌ అండ్‌ ఓన్లీ చరణ్‌కే ఉందని మెగాస్టార్‌ అనడం విశేషం. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. తెలుగు సినిమాలో ఇంతవరకూ చూడని టెక్నికల్‌ వేల్యూస్‌ని ఈ సినిమాలో చూపించనున్నారట.

ALSO READ: వివేకం తెలుగు రివ్యూ & రేటింగ్స్