ENGLISH

సినిమా మాత్రమే కాదు, అంతకు మించి: తాప్సీ

16 December 2020-15:54 PM

'ఏ సినిమానైనా ఇష్టపడే చేస్తాం. కొన్ని సినిమాల కోసం ఇష్టంగా కష్టపడతాం. కొన్ని సినిమాలు అసాధ్యమని తెలిసీ, సుసాధ్యం చేయడానికి కష్టపడతాం. అప్పుడే అద్భుతాలు సృష్టించగలుగుతాం..' అంటోంది తాప్సీ. 'అథ్లెటిక్‌ ట్రైనింగ్‌ దాదాపు అసాధ్యం అనే చర్చ తొలుత జరిగింది. నిజమే.. అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, కొన్ని సినిమాల కోసం నేను పడ్డ కష్టం, అథ్లెటిక్‌గా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి ఉపయోగపడింది..' అంటూ తన తాజా చిత్రం 'రష్మి రాకెట్‌' కోసం అథ్లెటిక్‌ ట్రైయినింగ్‌ తీసుకోవడం గురించి వ్యాఖ్యానించింది తాప్సీ.

 

'రష్మి రాకెట్‌' సినిమా కోసం ట్రెయినింగ్‌ తీసుకున్న తాప్సీ, ఆ ట్రెయినింగ్‌ని పూర్తి చేసుకుంది. ఓ అథ్లెట్‌ ఎలాగైతే ప్రాక్టీస్‌ చేయాల్సి వుంటుందో, అచ్చంగా ఆ ప్రాక్టీస్‌ అంతా చేయాల్సి వచ్చింది తాప్సీకి. 'మరీ అంత ఎక్కువ అవసరం లేదు.. ఎలాగోలా మేనేజ్‌ చేసేద్దాం..' అని దర్శక నిర్మాతలు సూచించినా, తాప్సీ మాత్రం కష్టపడేందుకే మొగ్గు చూపిందట. 'నా వరకు నేను ఏ పాత్ర చేసినా, అది తెరపై సంపూర్ణంగా వుండాలనే అనుకుంటాను. అదే నన్ను ఇంతలా కష్టపడేలా చేసింది. అదే నాకు సినీ పరిశ్రమలో ఈ స్థాయిని ఇచ్చింది..' అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ఇకపై కూడా ఇలాంటి సినిమాలు చేస్తాననీ, సినిమా కోసం ఎంత కష్టపడాల్సి వచ్చినా వెనుకంజ వేయననీ తాప్సీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ALSO READ: మెహ‌ర్ ర‌మేష్ ఆశ‌ల‌పై చిరు నీళ్లు