ENGLISH

స‌మంత‌, తాప్సిల మ‌ల్టీస్టార‌ర్‌

03 November 2021-18:11 PM

ఇప్పుడంతా మ‌ల్టీస్టార‌ర్ల కాల‌మే. ఇద్ద‌రు హీరోలు క‌లిసి, మెల‌సి సినిమాలు చేస్తున్నారు. వాటికి బోలెడంత క్రేజ్ కూడా. హీరోలే క‌ల‌సి సినిమాలు చేస్తున్న‌ప్పుడు హీరోయిన్లు చేయ‌లేరా? ఆ ట్రెండ్ కూడా మొద‌ల‌వుతోంది. తాజాగా స‌మంత‌, తాప్సి క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. అందునా బాలీవుడ్ లో. తాప్సి ఇటీవ‌ల ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. `అవుట్ సైడ‌ర్స్‌` పేరుతో... తాప్సి ఓ నిర్మాణ సంస్థ మొద‌లెట్టింది. అందులో భాగంగా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంది.

 

ఇప్పుడు స‌మంత‌తో ఓ సినిమా చేయ‌బోతోంద‌ట తాప్సి. ఇందులో తాప్సి కూడా న‌టించ‌బోతోంది. ఓర‌కంగా ఇది హీరోయిన్ల మ‌ల్టీస్టార‌ర్ అనుకోవొచ్చు. తాప్సికి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. త‌న సినిమాలకు అక్క‌డ మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఓటీటీ రూపంలోనే బ‌డ్జెట్ మొత్తం వెన‌క్కి తీసుకురావ‌డం.. తాప్సి స్టామినాకు నిద‌ర్శ‌నం. ఇప్పుడు స‌మంత కూడా తోడైంది.

 

స‌మంత ఉంటే.. సౌత్ లో త‌న సినిమాకి మంచి మార్కెట్ జ‌రుగుతుంద‌న్న‌ది తాప్సి న‌మ్మ‌కం. హిందీలో మంచి రేటు రావ‌డానికి తాప్సి ఎలానూ ఉంటుంది. అందుకే.. ఇది ముందే టేబుల్ ప్రాఫిట్ సినిమా అయిపోయింది. స‌మంత బాలీవుడ్ పై ఈమ‌ధ్యే దృష్టి పెట్టింది. త‌న‌కి క‌థ‌ల్ని ఎంపిక చేసుకోవ‌డంలో తాప్సి ఓ స్నేహితురాలిలా స‌హాయ‌ప‌డుతోంద‌ట‌. దాంతో పాటు ఈ ప్రాజెక్టునీ ప‌ట్టాలెక్కించేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

ALSO READ: Samantha Latest Photoshoot