ENGLISH

ట‌బు కోటికి ప‌డిపోతుందా?

28 August 2020-09:17 AM

బాలీవుడ్ సినిమా `అంధాధూన్‌`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ క‌థానాయ‌కుడు. బాలీవుడ్ లో ట‌బు పోషించిన పాత్ర కోసం తెలుగులో ప్ర‌త్యామ్నాయం అన్వేషించారు. కానీ ఎంత‌కీ తేల‌డం లేదు. న‌య‌న‌తార‌ని అనుకున్నా.. త‌ను ఏకంగా 9 కోట్లు డిమాండ్ చేయ‌డంతో నీర‌సించిపోయింది చిత్ర‌బృందం. ప్రియ‌మ‌ణి నుంచి అన‌సూయ వ‌ర‌కూ చాలామంది పేర్లు ప‌రిశీలిన‌కు వచ్చాయి. శిల్పా శెట్టి ని ఖాయం చేశార‌న్నారు... కానీ తిరిగి తిరిగి ఈ పాత్ర ట‌బు చేతికే వెళ్లేలా క‌నిపిస్తోంది.

 

నిజానికి ట‌బుతోనే ఈ పాత్ర వేయించాల‌ని ముందు అనుకున్నారు. కానీ ఓసారి చేసిన పాత్ర మ‌ళ్లీ చేయ‌డానికి ట‌బు అంగీక‌రించ‌లేదు. అయితే ఇప్పుడ ఏ ప్రాత్యామ్నాయం లేక‌పోవ‌డంతో ట‌బుకే ఫిక్స్ అయిన‌ట్టు టాక్‌. ట‌బుకి చిత్ర‌బృందం కోటి రూపాయ‌ల పారితోషికం ఇవ్వ‌డానికి రెడీ అయ్యింద‌ని, కోటి కోసం ట‌బు ఈ పాత్ర చేయ‌డానికి రెడీ అయ్యింద‌ని టాక్‌. ట‌బుకి తెలుగులో అంత డిమాండ్ లేదు. అందుకే.. కోటికి ఓకే అనేసింద‌ట‌. ట‌బు ఒప్పుకుంటే... నితిన్ సినిమాకి అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయిన‌ట్టే.

ALSO READ: Tabu Hot Photoshoot