ENGLISH

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నిజంగా రాజు : తమన్నా

17 February 2023-11:39 AM

ఆతిథ్యమివ్వడంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. అమితాబ్, శ్రద్దా కపూర్ లాంటి బాలీవుడ్ తారలు కూడా ప్రభాస్ ఆతిధ్యం కోసం ప్రత్యేకంగా చెబుతుంటారు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది.

 

‘‘ప్రభాస్‌ అతిథులను ఎలా చూసుకుంటారో దేశమంతా తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే అందులో కనీసం 30 రకాల వంటకాలు ఉంటాయి. డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే నిజంగా ఒక రాజు ఎలా ఉంటాడో ప్రభాస్‌ను చూస్తే తెలుస్తుంది. ఆయన్ని అభిమానులు ఎంతగా ఇష్టపడతారో అతడికి తెలియదు. అతడు అంత పెద్ద స్టార్‌ అయినా.. చాలా సాధారణంగా ఉంటాడు’’ అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో కలసి బాహుబలి రెబల్ చిత్రాలలో నటించింది తమన్నా.