మన కథానాయికల పారితోషికాలు చుక్కల్ని తాకేస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే... మరీ కొండెక్కి కూర్చుంటున్నారు. తమన్నా కూడా అంతే! బాలీవుడ్లో ఘన విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని దక్షిణాదిలో రీమేక్ చేయాలని తహతహలాడుతున్నాడు త్యాగరాజన్. అందుకోసం చాలామంది కథానాయికల్ని సంప్రదించారు. చివరికి ఈ స్క్రిప్టు తమన్నా దగ్గరకు వచ్చి ఆగింది. తమన్నా కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. అయితే పారితోషికం మాత్రం భారీగా డిమాండ్ చేసిందట. బడ్జెట్లో దాదాపు సగం.. తమన్నా పారితోషికానికే సరిపోయేట్టు ఉండడంతో త్యాగరాజన్.. తమన్నాని తప్పించినట్టు తెలుస్తోంది. తమన్నా అయితే బాగుంటుందని త్యాగరాజన్ భావించారని, అందుకోసం తమన్నా చుట్టూ చాలాసార్లు తిరిగారని, పారితోషికం తగ్గించుకోవడంలో ససేమీరా అనడంతో.. తమన్నాని పక్కన పెట్టడం తప్పలేదని తమిళ సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరింతకీ తమన్నా ఎంత అడిగేసిందో, ఏంటో..??