రామ్ చరణ్ - తమన్నా.. `రచ్చ` సినిమాతో ఈ కాంబో రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబోని చూసే అవకాశం దక్కబోతోందని టాక్. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో ఓ కథానాయికగా కియారా అద్వాణీ ఎంపికైంది. ఇప్పుడు మరో కథానాయికగా తమన్నాని తీసుకున్నారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో తమన్నా చరణ్ పక్కన హీరోయిన్ గా నటించడం లేదట. తన పాత్ర అంతకు మించి ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాలో తమన్నా పాత్రలో కొన్ని నెగిటీవ్ షేడ్స్ ఉంటాయని, ఆ పాత్రని తెరకెక్కించే తీరు వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో తమన్నా నిడివి కూడా 20 నిమిషాల పాటే ఉంటుందని, అయితే ఆ 20 నిమిషాలూ.. హీటెక్కించే స్థాయిలో తమన్నా ని చూపించబోతున్నారని ఇన్‌సైడ్ వర్గాల టాక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. చరణ్ - కైరాలపై ఓ పాటని తెరకెక్కిస్తారని, ఆ పాటతోనే కొబ్బరికాయ కొడతారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాట కోసం ఇప్పటికే హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేశారని సమాచారం.
ALSO READ: రానా ఎక్కడా కనిపించడం లేదే...?