ENGLISH

'సైరా'లో మెగాస్టార్‌ సరసన తమన్నా?

31 August 2017-17:52 PM

మిల్కీ బ్యూటీ తమన్నా మెగా ఆఫర్‌ కొట్టేసిందట. మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో తమన్నాకి చోటు దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను ఇప్పటికే సెలెక్ట్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌తో పాటు నయనతార స్టిల్‌ కూడా రిలీజ్‌ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమన్నా పేరు పరిశీలిస్తున్నారట. అయితే ఈ సినిమాలో తమన్నాది గ్లామర్‌ పాత్ర కాదట. కానీ ప్రాధాన్యత ఉన్న పాత్రేనట. 'బాహుబలి' సినిమాలో తమన్నా గ్లామరస్‌గానూ కనిపించింది. మరో పక్క కత్తి పట్టి యుద్ధాలు కూడా చేసేసింది. ఆ కత్తి యుద్ధాలు చూసే తమన్నాని ఈ సినిమా లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో తమన్నా 'రచ్చ' సినిమాలో నటించింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌లో వాన పాటలో ఆమె పర్‌ఫామెన్స్‌కి మెగాస్టార్‌ ప్రశంసలు అందుకుంది తమన్నా. ఇప్పుడు ఆయనతో నటించే అవకాశం వస్తే ఇంకేముంది. తమన్నా ఆనందానికి అవధులే ఉండవు కదా. ఇప్పటికే మెగా కాంపౌండ్‌లో అల్లు అర్జున్‌తోనూ, పవన్‌ కళ్యాణ్‌తోనూ నటించేసింది తమన్నా. ఇక మెగాస్టార్‌తో తమన్నా అనే గాసిప్‌ నిజమే అయితే అంతకన్నా కావాల్సిందేముంటుంది. ఆమె ఫ్యాన్స్‌కి ఆనందమే. ప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా ఆఫర్స్‌ లేవు. సో ఈ తరుణంలో మెగా ఆఫర్‌ చిక్కడం నిజమే అయితే తమన్నా దశ తిరిగినట్లేగా!

ALSO READ: బాలకృష్ణ పైసా వసూల్ స్టొరీ లీక్?