ENGLISH

'సాహో'లో మిల్కీ బ్యూటీ

29 August 2017-16:47 PM

ప్రబాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న సూపర్‌ యాక్షన్‌ మూవీ 'సాహో'లో మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికైందని ప్రచారం జరుగుతోంది. అదేంటి ఈ సినిమాలో హీరోయిన్‌ బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ కదా అనుకుంటున్నారా? అవును అది నిజమే. అయితే శ్రద్ధాని మెయిన్‌ హీరోయిన్‌గానూ, తమన్నాని సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. తమన్నా, ప్రబాస్‌ కలిసి నటించిన 'బాహుబలి ది బిగినింగ్‌', ది కంక్లూజన్‌' సినిమాలు సెన్సేషనల్‌ విజయాలు. గతంలోనూ ప్రబాస్‌తో తమన్నా 'రెబల్‌' చిత్రంలో నటించింది. ఒక విషయం గమనిస్తే, తమన్నా - ప్రబాస్‌ కాంబినేషన్‌లో మరో హీరోయిన్‌కీ ఖచ్చితంగా ఛాన్స్‌ ఉంటూ వస్తోంది. అలాగే ఈ సినిమాలో కూడా తమన్నా నటిస్తోందంటూ గాసిప్స్‌ విన వస్తున్నాయి. ఒకవేళ ఈ గాసిప్‌ నిజమైతే, తమన్నా మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కినట్లే. ప్రబాస్‌కి 'సాహో' ప్రెస్టీజియస్‌ మూవీ. 'బాహుబలి' తర్వాత తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ మూవీ. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా చెలామణీ అయిన తమన్నాకి 'బాహుబలి' తర్వాత పెద్దగా ఆఫర్లు లేవు. సో ఈ ఛాన్స్‌ మిల్కీ బ్యూటీకి బంపర్‌ ఆఫరే అని చెప్పాలి. మరో పక్క ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'జై లవకుశ' లో తమన్నా నటిస్తోందనీ టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్‌లో నటిస్తోందనీ సమాచారమ్‌.

ALSO READ: తమన్నా రెండు సినిమాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?