ENGLISH

బోల్డ్‌నెస్‌తో పాటు, ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..!

04 December 2018-07:57 AM

మిల్కీబ్యూటీ తమన్నాకి అస్సలు ఖాళీగా ఉండడం నచ్చదంట. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనో, లేక ఏదో ఒకదాని గురించి ఆలోచిస్తూనో ఉండాలని అనుకుంటుందట. కొత్త విషయాల్ని నేర్చుకోవడం అంటే మిల్కీబ్యూటీకి భలే సరదా అట. అందుకే ఆమెను ఇండస్ట్రీలో చాలామంది నిత్య విద్యార్ధిని అని ముద్దుగా అంటుంటారు. ఇకపోతే వన్‌ ఆఫ్‌ ది స్టార్‌ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకున్న తమన్నా కెరీర్‌ ఇప్పుడు కాస్త స్లోగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నా,  చేతిలో చాలానే సినిమాలున్నాయి.

ముఖ్యంగా తమన్నా నటించిన 'నెక్స్ట్‌ ఏంటీ' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల 'నా నువ్వే' సినిమాతో క్లాసీ లుక్‌తో అందంగా ఆకట్టుకున్న తమన్నా, ఇప్పుడు బోల్డ్‌ కంటెన్ట్‌ మూవీతో వస్తోంది. స్టార్‌ కాస్టింగ్‌ పక్కన పెడితే, సినిమాలో కంటెన్ట్‌ మాత్రం చాలా ఇంపార్టెంట్‌ అంటోంది 'నెక్ట్స్‌ నువ్వే' గురించి చెబుతూ మన మిల్కీబ్యూటీ. యంగ్‌ హీరో సందీప్‌కిషన్‌తో తమన్నా ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తోందీ సినిమాలో. నవదీప్‌, పూనమ్‌ కౌర్‌ మరో జంటగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ ఈ సినిమాకి దర్శకుడు. బాలీవుడ్‌ దర్శకుడు కదా. సినిమాలో కాస్త ఎక్కువే బోల్డ్‌ సన్నివేశాలున్నాయి. బోల్డ్‌ సీన్స్‌, బోల్డ్‌ డైలాగ్స్‌ ఇలా టోటల్‌ కంటెన్ట్‌కి బోల్డ్‌నెస్‌తో పాటు, కామెడీని బాగా మిక్స్‌ చేశారట. ప్రేమ, సెక్స్‌ తదితర విషయాల గురించి, ప్రస్తుతం అమ్మాయిల చుట్టూ నెలకొన్న పరిస్థితుల గురించి ఈ సినిమాలో ప్రస్థావించారట. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. యూత్‌ ప్రతీ ఒక్కరూ తప్పక చూడదగ్గ చిత్రంగా 'నెక్స్‌ ఏంటీ' చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తున్నారు. అసలింతకీ 'నెక్ట్స్‌ నువ్వే'తో మిల్కీబ్యూటీ ఏం చెప్పదలచుకున్నదో పూర్తిగా తెలియాలంటే ఈ సినిమా చూసి తీరాల్సిందే.