ENGLISH

స్వ‌ర్గ‌మంతా... నా ఇంట్లోనే!!

12 April 2021-10:00 AM

గృహ‌మే క‌దా స్వ‌ర్గ సీమ అన్నారు పెద్ద‌లు. ఆ మాట అక్ష‌రాలా నిజం. బ‌య‌ట ఎంత తిరిగినా, సాయింత్రం ఇంటికి చేరుకునే స‌రికి, మ‌న‌సు ప్ర‌శాంతంగా మారిపోతుంది. త‌మ‌న్నాకీ అంతేన‌ట‌. ఇంటికివెళ్ల‌గానే... క‌ష్టం మ‌ర్చిపోయి రిలాక్స‌యిపోతాన‌ని అంటోంది. ఇటీవ‌ల ఓ షోలో భాగంగా ముంబైలోని త‌న ఇంటిని ప‌రిచ‌యం చేసింది. త‌న ఇంటిలోని ప్ర‌తీ గ‌దినీ.. కెమెరాలో బంధించి, అభిమానుల‌తో పంచుకుంది.

 

''అంద‌రిలానే నా ఇల్లంటే నాకు చాలా ఇష్టం. కాస్త స‌మ‌యం దొరికినా ఇంట్లోనే ఉండాల‌నుకుంటా. ఓ కిటికీ ప‌క్క‌న కూర్చుని, బ‌య‌టి ప్ర‌పంచాన్ని చూస్తూ టీ తాగ‌డం భ‌లేగా ఉంటుంది. అదేంటో నా ఇల్లు ప్ర‌తీరోజూ నాకు కొత్త‌గానే క‌నిపిస్తుంది. నా ఇంట్లోని ప్ర‌తీ వ‌స్తువూ.. నాన్నే స్వ‌యంగా కొనుక్కొచ్చారు. నా ఇంట్లో మా నాన్న ప్రేమ అడుగ‌డుగునా క‌నిపిస్తుంది'' అని మురిసిపోయింది.

ALSO READ: Tamanna Latest Photoshoot