ENGLISH

బాలయ్యతో తమన్నా చిందులు

27 February 2024-17:28 PM

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వరుస హిట్స్ తో  మంచి జోరు మీదున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య నెక్స్ట్ బాబీతో  ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్  కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్  ఉంటుందని, ఈ సాంగ్ కోసం మిల్క్ బ్యూటీ తమన్నాని సెలెక్ట్ చేసినట్టు సమాచారం.


బాలయ్యతో తమన్నా ఇప్పటివరకు కలిసి నటించలేదు. బాలయ్య భగవంత్ కేసరి లో కూడా తమన్నాని ఒక స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటారని టాక్ వచ్చినా అది వర్క్ అవుట్ కాలేదు.  మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కలిసి చిందేయనున్నారని టాక్. తమన్నా ఇప్పటి వరకు చేసిన స్పెషల్ సాంగ్స్ ఫుల్ పాపులర్ అయ్యాయి. 'జై లవకుశ' లో ఎన్టీఆర్ తో చేసిన స్వింగ్ జరా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసందే. నెక్స్ట్ 'సరి లేరు నీకెవ్వరు' లో మహేష్ తో,  ‘జైలర్’లో రజినీ కాంత్  తో కలిసి స్టెప్పులు వేసింది. జైలర్ లో తమన్నా స్టెప్ లకి వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చింది. అసలు ఈ మూవీ జనాల్లోకి వెళ్ళింది తమన్నా సాంగ్ వల్ల అన్నది కాదనలేని నిజం. ఇప్పుడు బాలయ్యతో కలిసి తమన్నా చిందేస్తే అది కూడా సినిమాకి కలిసి వస్తుందని, మేకర్స్ ఈ మిల్క్ బ్యూటీకి ఓటు వేశారని సమాచారం.


బాలయ్య రెగ్యులర్ టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదని, భగవంత్ కేసరి మూవీ లానే ఇది కూడా,  ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఈ  సినిమాలోని యాక్షన్ విజువల్స్ వేరే లెవెల్లో ఉంటాయని, ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. పాలిటిక్స్ నేపథ్యంలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.