ఊరు, పేరు లేని వాళ్లని స్టార్స్ ని చేయడంలో మొనగాడు తేజ. కానీ స్టార్స్ దగ్గరకి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని ఫోబియా వచ్చేస్తుంటుంది. స్టార్స్ ని డీల్ చేయలేక డీలా పడిన సందర్భాలు తేజ కెరీర్లో చాలా ఉన్నాయి. మహేష్ బాబుతో చేసిన `నిజం` అందుకో క్లాసిక్ ఎగ్జాంపుల్. స్టార్‌తో సినిమా అనుకున్న ప్రతీసారీ... ఏదో ఓ ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది. అప్పట్లో వెంకటేష్ తో ఓ సినిమా అనుకున్నారు. కథ, ఇతర సెటప్ అంతా ఓకే. కానీ.. అర్థాంతరంగా ఆగిపోయింది.
గోపీచంద్ - తేజ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. `అలివేలు మంగ - వేంకటరమణ` అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింది. ఈ సినిమాతో పాటు రానాతో ఓ సినిమా కూడా ప్రకటించాడు తేజ `రాక్షస రాజు రావణాసురుడు` అనే టైటిల్ పెట్టారు. ఆ సినిమా గురించి కూడా అడ్సస్స్ లేదు. ఇప్పుడు దగ్గుబాటి అభిరామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు తేజ. తనకు చిన్న చిన్న హీరోలూ, చిన్న సెటప్పులే బెటరేమో..? పెద్ద హీరోలతో పెట్టుకుంటే ఇలా ఏదో ఓ అవాంతరం వస్తూనే ఉంటుంది మరి.
ALSO READ: అప్పుడు ఐదు వేలు... ఇప్పుడు యాభై కోట్లు