ENGLISH

తెలుగు సినిమాకి స్వర్ణయుగమే.. ప్రేక్షకులకో.!

25 November 2020-12:05 PM

ఇంట్లో కూర్చుని ఫ్రీగా సినిమా చూసేస్తున్నారు కరోనా నేపథ్యంలో సినీ ప్రేక్షకులు. మరి, వాళ్ళని సినిమా థియేటర్లకు తీసుకెళ్ళాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో తాయిలాలు ప్రకటించాలి. సినిమా టిక్కెట్ల ధరలు తగ్గాలి. కానీ, అలా జరిగితే సినిమాలకి చాలా చాలా నష్టం. తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమకు వరాలు ప్రకటించింది. సినిమా థియేటర్లలో షోలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.

 

టిక్కెట్ల ధరల్ని కూడా పరిస్థితులకు తగ్గట్టు మార్చుకునే అవకాశం కల్పిస్తారట. ఇది నిజంగానే అద్భుతమైన వరం. చిన్న సినిమాలకు ట్యాక్స్‌ మినహాయింపు, పెద్ద సినిమాలకూ కొన్ని వెసులుబాట్లు.. వెరసి, సినీ పరిశ్రమకు రాబోయేది స్వర్ణయుగమేనన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ, ప్రేక్షకుల మాటేమిటి.? ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్లు తెరుచుకోవడమేంటే అంత తేలిక కాదు.

 

కరోనా సెకెండ్‌ వేవ్‌ అనే వాదనను ప్రభుత్వమే బలంగా తెరపైకి తెస్తోంది. అంటే, సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, సినిమా థియేటర్లను తెరచుకునేందుకు అనుమతులిచ్చేశారు. అయితే, థియేటర్ల యాజమాన్యాలు మాత్రం, కొంత ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లను తెరిస్తే అదనపు ఖర్చులుంటాయంటున్నారు. ప్రేక్షకులు పూర్తిగా రాకపోతే, నష్టాలే రావొచ్చు. అటు థియేటర్ల యాజమాన్యాలకీ లాభం లేక, ఇటు ప్రేక్షకులకూ లాభం లేక.. సినీ పరిశ్రమ ఎలా గట్టెక్కేది.?

ALSO READ: విష్ణుతో 'ఢీ' కొట్టేది ఎవ‌రు?