ENGLISH

సినీ పాత్రికేయులకు అండదండగా ఉంటాం

31 March 2024-14:02 PM

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, దిల్ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఎఫ్‌జెఎ అధ్య‌క్షుడు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు, ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు స‌హా అసోసియేష‌న్ స‌భ్యులు, జ‌ర్న‌లిస్ట్‌లు పాల్గొన్నారు. టీఎఫ్‌జెఎ సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది.  అసోషియేష‌న్ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తుంది.  


ఈ కార్య క్రమంలో TFJA ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు గారు  మాట్లాడుతూ 'మన యూనిటీతో 20 ఏళ్లు స‌క్సెస్‌ఫుల్‌ జర్నీకొనసాగించాం అని, మ‌నం సాధించాల్సిన విష‌యాలు ఇంకా ఉన్నాయి. మెడిక‌ల్ మాత్ర‌మే కాదు, హౌసింగ్ ఉంది. టీఎఫ్‌జేఏకి వెన్నంటు ఉంటూ మ‌న‌ల్ని న‌డిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారికి ధ‌న్య‌వాదాలు, ఇప్పుడు 181 మంది స‌భ్యులం ఉన్నాం. ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ క‌లిపి 481 మంది ఉన్నాం. 2004 వరకు ప్రింట్‌,  శాటిలైట్ చానెల్స్ వాళ్ళం ఉన్నాం. ఇవాళ డిజిట‌ల్ మీడియా సభ్యులు కూడా ఉన్నారు. కోవిడ్ టైమ్‌లో చిరంజీవిగారు మ‌న అసోసియేష‌న్‌ సభ్యులకి, ఫ్యామిలీ మెంబెర్స్ కి యోధా డ‌యోగ్న‌స్టిక్స్ ద్వారా 50 శాతం వెసులుబాటు క‌ల్పించారు.  అంతే కాదు కోవిడ్ టైమ్‌లో అసోసియేష‌న్ ద్వారా రెండు సార్లు గ్రాస‌రీస్ అంద‌జేశాం.  5 ల‌క్ష‌లు మెంబ‌ర్‌కి, 5 ల‌క్ష‌లు ఫ్యామిలీకి కేటాయించి మెడిక‌ల్ ఇన్య్సూరెన్స్ ప్ర‌తి వ్య‌క్తికీ 10 ల‌క్ష‌లు అందిస్తున్నాం. ఇందులో స‌గం మెంబ‌ర్ క‌ట్టుకుంటే, స‌గం అసోసియేష‌న్ భ‌రిస్తోంది.  ట‌ర్మ్ పాల‌సీ కింద ప్ర‌తి స‌భ్యుడికీ ఏడాదికి 15 ల‌క్ష‌లు ఇస్తున్నాం. 25 ల‌క్ష‌ల రూపాయ‌లు యాక్సిడెంట‌ల్ పాల‌సీ, ఆఫీసుల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే వారి శాల‌రీ నుంచి 70 శాతం 16 నెల‌లు అందిస్తాం. 


TFJA జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె. రాంబాబు గారు  మాట్లాడుతూ 20 ఏళ్ల అసోసియేష‌న్‌లో హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎల‌క్ట్రానిక్ మీడియా వ‌చ్చిన కొత్త‌లో పెట్టిన అసోసియేష‌న్ ఇది. ఇప్పుడు డిజిట‌ల్ మీడియా కూడా ఎల‌క్ట్రానిక్ మీడియాలో భాగం. అందుకే 2019లో డిజిట‌ల్ మీడియాను కూడా క‌లుపుకుని ఐదేళ్లు ఫీల్డ్ లో ప‌నిచేసిన వారంద‌రికీ స‌భ్య‌త్వం ఇచ్చాం. సోష‌ల్ మీడియా పెరిగాక యూట్యూబ్‌లో వ‌చ్చేవాళ్లు కూడా జ‌ర్న‌లిస్టుల‌నే అంటున్నారు. సొంత వ్యూస్ చెప్ప‌డానికి జ‌ర్న‌లిస్టుగా ట్యాగ్ వేసుకోవ‌డం బాధ‌గా అనిపిస్తుంది.  జ‌ర్న‌లిస్టుల‌కు అకౌంట‌బిలిటీ తీసుకొస్తున్నాం. 2021లో డిజిట‌ల్ మీడియా అని ఓ సంస్థ పెట్టాం. దాన్ని యాక్టివ్ చేసే ప‌నిలో ఉన్నాం. దాన్ని కూడా యాక్టివ్ చేస్తాం. ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్లు ఎవ‌రు?  సోష‌ల్  మీడియా ఎవ‌రు? వ‌ంటివాటిని పీఆర్వో ఆసోసియేష‌న్‌తో మాట్లాడుతున్నాం. పొల్యూష‌న్ లేని సొసైటీ కోసం కృషి చేస్తున్నాం. సినిమా ఇండ‌స్ట్రీ బావుంటే అంద‌రూ బావుంటారు. కాబ‌ట్టి సినిమా ఇండ‌స్ట్రీ బావుండాల‌ని కోరుకోండి అని అన్నారు.


TFJA ప్రెసిడెంట్‌ వార‌ణాసి ల‌క్ష్మీనారాయ‌ణ గారు మాట్లాడుతూ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ అంటే ఓ యూనిటీ, ఓ భ‌రోసా. ఈ సంస్థ ఏర్ప‌డ‌టానికి ముఖ్య‌కార‌ణం హెల్త్ కి సంబంధించి అంద‌రికీ ఓ భ‌రోసా క‌ల్పించాల‌న్న‌దే. నెక్స్ట్ మన ఎయిమ్ హౌసింగ్‌. త్వ‌ర‌లో హౌసింగ్ మెంబ‌ర్‌షిప్‌కి అంద‌రికీ ఆహ్వానం అందుతుంది. స‌భ్యులంద‌రికీ ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్‌గారి ఆధ్వ‌ర్యంలో ప్లాట్లు వ‌చ్చే విధంగా కృషి చేస్తాం. ఇన్నేళ్లుగా మ‌న అసోసియేష‌న్‌కి ఆర్థికంగా సాయ‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.


తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస‌రెడ్డి గారు  మాట్లాడుతూ 'మ‌నం ప్ర‌జ‌ల ప‌క్షాన ప‌నిచేస్తున్నామ‌నే భావ‌న జ‌నాల‌కు క‌ల‌గ‌జేయాలి. తెలంగాణ‌లో 23వేల మంది అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. ప్ర‌తి సంస్థ‌లోనూ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేకంగా అక్రిడేష‌న్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఎలిజెబుల్ పీపుల్‌కి క‌చ్చితంగా అక్రిడేష‌న్ ఇప్పిస్తాం అన్నారు.  


హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల‌కు శ్రీనివాస‌రెడ్డి గారు ల్యాండ్‌ ఇప్పిస్తే, అంద‌రూ ఆనందంగా ఉంటారు. ఈ కార్య క్రమంలో నేను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది.  జీవితంలో ఎవ‌రికైనా మూడే ముఖ్యం. ఒక‌టి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డ‌బ్బు. ఈ మూడింటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. అంద‌రూ ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోండి. నేను మీతో సుదీర్ఘ ప్ర‌యాణం చేస్తాను అని అన్నారు.


దిల్‌రాజు మాట్లాడుతూ  కాల‌క్ర‌మేణ జ‌ర్న‌లిజం కూడా మారిపోతూ వ్యాపార‌మైపోయింది. అంద‌రూ బావుండాలి. వ్యాపారం చేయాలి. కానీ జ‌ర్న‌లిస్టుగా రాసే ప‌దం చాలా ముఖ్యం. ఎక్క‌డో ఉన్న మీ కుటుంబాల‌ను పైకి తీసుకురావ‌డం కోసం కృషి చేసే మీలాంటి స్టార్ గురించి ఫ్యామిలీ స్టార్ లో చూపిస్తున్నాం. ఎక్క‌డి నుంచో వ‌చ్చి, సొసైటీలో ఫ్యామిలీస్‌కి మ‌ర్యాద‌ను తెచ్చిపెట్టే ప్ర‌తి ఒక్క‌రూ ఫ్యామిలీస్టారే. అదే మా సినిమా కాన్సెప్ట్' అని అన్నారు.


పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌ను ఫ్రీగా ఇప్పించండి. స్థ‌లాల‌ను రేవంత్‌రెడ్డి గారిని అడ‌గండి. ఇళ్లు మీరు క‌ట్టుకోండి. శ్రీనివాస‌రెడ్డిగారు స్థ‌లాల‌ను ఇప్పించి పుణ్యం క‌ట్టుకోవాలి. తుపాకి క‌న్నా క‌లానికి భ‌య‌ప‌డ‌తాన‌ని అన్నారు నెపోలియ‌న్‌. ఎంతో మంది జ‌ర్న‌లిస్టులను క‌న్న‌ది సినిమా త‌ల్లి. ఆ రోజుల్లో వారం రోజుల‌కు త‌ర్వాతే రివ్యూలు రాసేవారు. కానీ ఇప్పుడు మార్నింగ్ షోకే రాస్తున్నారు. సినిమా గురించి రాస్తున్నప్పుడు ద‌య‌చేసి సినిమాను చంపేయ‌కండి. కేర‌క్ట‌ర్ అసాసినేష‌న్ చేయ‌కండి.ద‌య ఉంచి త‌ప్పుడు రాత‌లు రాయకండి. సినిమా ఇవాళ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది. సినిమా ఇండ‌స్ట్రీలో 90 శాతం స‌గ‌టు నిర్మాత‌లున్నారు. కానీ 10 శాత‌మే విజ‌యం ఉంది. మిగ‌లిన 90 శాతం ఎలా ఉంది?  మీడియాలో భారీ సినిమాల‌నే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మిగిలిన సినిమాల ప‌రిస్థితి ఏంటి? అన్నీ చూడండి.. అంద‌రినీ ప్రోత్స‌హించండి అని అన్నారు.