ENGLISH

మేడ‌మీద న‌రేష్‌... అమ్మ‌మ్మ ఇంట్లో నాగ‌శౌర్య‌

13 March 2017-11:46 AM

తెలుగు టైటిళ్లలో ఈమ‌ధ్య కాస్త తెలుగుద‌నం క‌నిపిస్తోంది. ఆ విష‌యంలో కాస్తో కూస్తో సంతోష ప‌డాల్సింది. ఇది వ‌ర‌కు.. ఏ టైటిల్ చూసినా.. ఇంగ్లీష్‌లోనో హిందీలోనో క‌నిపించేది. పాట‌ల పేర్లు, పాత్ర‌ల పేర్లు కూడా .. టైటిళ్ల‌యిపోయాయి. ఈ సీజ‌న్‌లో కొన్ని చూడ‌చ‌క్క‌ని తెలుగు పేర్లు వినే అవ‌కాశం క‌లిగింది. అల్ల‌రి న‌రేష్‌కొత్త సినిమా ఇటీవ‌లే మొద‌లైంది. దానికి మేడ‌మీద అబ్బాయి అనే మంచి టైటిల్‌ని సెలెక్ట్ చేశారు. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాకి అమ్మ‌మ్మ‌గారి ఇల్లు అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది.  విష్ణు కొత్త సినిమాకి ఆచారి అమెరికా యాత్ర అని పేరు పెట్టారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ తెర‌కెక్కించే చిత్రం కోసం రారండోయ్ వేడుక చూద్దాం అనే పేరు ఖ‌రారు చేశారు. అలా మ‌న‌దైన తెలుగు పేర్ల‌ని వినే, చూసే అవ‌కాశం ద‌క్కింది. మిగిలిన హీరోలూ తెలుగు టైటిళ్ల‌నే ఎంచుకొంటే.. ఆంగ్ల జాడ్యం కొంత వ‌ర‌కైనా త‌ప్పించుకొనే వీలుంది.