ENGLISH

Tharun: ఆ వార్తలో నిజం లేదు : హీరో తరుణ్

31 August 2022-14:21 PM

మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు.

 

తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో సందడి చేసిన తరుణ్ కొంత కాలంగా సినిమాలకు గాప్ తీసుకున్నారు. అయితే ఎలా మొదలయిందో? ఎందుకు మొదలయిందో తెలియదు కానీ తరుణ్‌ మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు మొదలయ్యాయి.

ALSO READ: కోబ్రా మూవీ రివ్యూ & రేటింగ్