ENGLISH

Chiru, Nag: థియేట‌ర్లు పంచుకుంటున్న చిరు,నాగ్‌

04 September 2022-11:36 AM

అక్టోబ‌రు 5... ఒకేసారి రెండు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. ఒక‌టి చిరంజీవి గాడ్ ఫాద‌ర్ అయితే, రెండోది నాగార్జున‌.. ది ఘోస్ట్‌! రెండూ పెద్ద సినిమాలే. నిజానికి చిరు గాడ్ ఫాద‌ర్ తో నాగ్ పోటీ ప‌డ‌లేడ‌ని, ఆ సినిమాని వాయిదా వేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ నాగ్ కూడా బ‌రిలోకి దిగిపోతున్నాడు. అంటే. ఈ స‌ద‌రాకి చిరు,నాగ్ మ‌ధ్య పోటీ త‌ప్ప‌ద‌న్న‌మాట‌.

 

అయితే చిరు, నాగ్ కావాల‌నే ఒకే రోజున రావ‌డానికి డిసైడ్ అయ్యార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. చిరు సినిమా అంటే.. ఏపీ, తెలంగాణ‌ల‌లో దాదాపుగా అన్ని థియేట‌ర్ల‌లోనూ ఆ సినిమానే ఉంటుంది. ఆచార్య‌కు అదే చేశారు. కానీ ఇప్పుడు చిరు ప్లాన్ మారింద‌ట‌. సినిమాని త‌క్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డ‌మే బెట‌ర్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చార్ట‌. దానికి కార‌ణం.. ఆచార్య‌నే.

 

ఈ సినిమాని అత్య‌ధిక ధియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. కానీ ఫ‌లితం తేడా కొట్టేసరికి బ‌య్య‌ర్లు భారీగా న‌ష్ట‌పోయారు. ఆ న‌ష్టాలు... మ‌ళ్లీ చూడ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. చిరు త‌క్కువ థియేట‌ర్ల‌తో స‌ర్దుకుంటే నాగ్ కి కూడా కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లు దొరుకుతాయి. సో.. థియేట‌ర్ల స‌మ‌స్య లేన‌ట్టే.

ALSO READ: త్రివిక్ర‌మ్ ట్రోలింగ్.. కార‌ణం ఆ హీరోయినే..!