ENGLISH

నా వయసు అలాంటిది: రాజ్‌తరుణ్‌

09 March 2017-16:40 PM

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాతో ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. అయితే ప్రేమకథలే ఎక్కువగా చేయడం గురించి రాజ్‌తరుణ్‌ని ప్రశ్నిస్తే, 'నా వయసు అలాంటిది' అని కొంటెగా సమాధానం చెప్పాడు ఈ చిలిపి చిన్నోడు. అలాగే ప్రేమ, పెళ్ళి గురించి ఆడిగితే, దానికింకా టైముందంటున్నాడు. ఇప్పుడప్పుడే కాదని అంటున్నాడు. ఇంతవరకు తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదన్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్‌ పేరుతో గాసిప్స్‌ మామూలేనని చెప్పాడు. అందులో భాగంగా బుల్లితెర యాంకర్‌ లాస్యతో ఎఫైర్‌ అని రాజ్‌ తరుణ్‌ గురించి గాసిప్స్‌ వచ్చాయి. అయితే ఆ వెంటనే లాస్య, తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడటంతో ఆ గాసిప్స్‌ ఉత్తవేనని తేలిపోయాయి. దాంతో రాజ్‌ తరుణ్‌ కొంచెం ఫ్రీ అయ్యాడు. కెరీర్‌లో ప్రస్తుతం రాజ్‌తరుణ్‌ బుల్లెట్‌లా దూసుకెళుతున్నాడు. ఆయన చేతిలో దిల్‌ రాజు సినిమా ఒకటి ఉంది. అది కాక 'అంధగాడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందట. ఈ సినిమాలో అంధుడిగా డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు రాజ్‌ తరుణ్‌. 'కిట్టుగాడు' సినిమా కోసం ఓ పాట కూడా రాసేశాడు మన బుల్లోడు రాజ్‌ తరుణ్‌. దీంతో అనుకోకుండా పాటల రచయిత కూడా అయిపోయాడు మనోడు. అయితే అదేదో సరదాగా జరిగింది కానీ తాను పాటల రచయితనేం కాదంటున్నాడు. 

ALSO READ: నితిన్ సీక్రెట్ పోలీసా??