ENGLISH

మెగా ప్రిన్స్‌ వచ్చేదెప్పుడు?

08 March 2017-11:36 AM

'ముకుందా' సినిమాతో తెలుగు తెరకు అందంగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వరుణ్‌ తేజ్‌. తొలి సినిమా నుంచీ ఒకే జోనర్‌కి ఫిక్స్‌ అయిపోకుండా, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మెగా హీరోగా వరుణ్‌ తేజ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి సినిమా కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కాగా, రెండో సినిమాకే ప్రయోగాల బాట పట్టాడు. 'కంచె' సినిమాతో వరుణ్‌ చేసిన ప్రయోగం ఫలించింది. అన్ని వర్గాల వారిని ఆ సినిమా అలరించడమే కాకుండా, విమర్శకులతో సైతం గొప్పగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుణ్‌లో మరో యాంగిల్‌ని బయటికి తెచ్చిన చిత్రం 'లోఫర్‌'. వరుణ్‌ తేజ్‌లోని మాస్‌ యాంగిల్‌ని ఈ సినిమా పరిచయం చేసింది. అయితే ఈ సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయినా, వరుణ్‌తేజ్‌ తనని తాను మాస్‌ హీరోగా ప్రజెంట్‌ చేసుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడింది. ఇక తాజా సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం వరుణ్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. 'లోఫర్‌' తర్వాత వరున్‌ తేజ్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో కూల్‌ అండ్‌ లవ్‌లీ ఎంటర్‌టైనర్‌ 'ఫిదా' చేస్తున్నాడు వరుణ్‌ తేజ్‌. శీను వైట్ల డైరెక్షన్‌లో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్‌' మరో పక్క. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. అతి త్వరలోనే వరుణ్‌ తేజ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ALSO READ: విజ‌య్ కుమార్ కొండాకు చేదు అనుభ‌వం