ENGLISH

రష్మికా మండన్నా ఆ తప్పు చేస్తుందా.?

26 April 2019-16:50 PM

టాలీవుడ్‌లో కెరీర్‌ సాఫీగా, సాగుతున్న టైంలో బాలీవుడ్‌ ఆలోచనలు చేసిన పలువురు ముద్దుగుమ్మల పరిస్థితి ఏమైందో గతంలో చూశాం. రకుల్‌తో ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో ఇటు తెలుగులోనూ, అటు కన్నడలోనూ క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న రష్మికా మండన్నాకి బాలీవుడ్‌ నుండి ఆఫర్లు వస్తున్నాయట. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కమ్‌ నిర్మాత అయిన సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణ సంస్థలో ఓ సినిమా రూపొందనుందట. ఆ సినిమా కోసం రష్మికాని హీరోయిన్‌గా ఆఫర్‌ చేస్తున్నట్లు ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. 

 

ఈ సినిమాకి బల్వీందర్‌ సింగ్‌ జాన్జువా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట. కథ రెడీ, డైరెక్టరూ, నిర్మాత కూడా రెడీ. ఇక హీరోయిన్‌ ఓకే అయిపోతే సినిమా పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నారట. అయితే రష్మికా నుండి గ్రీన్‌ సిగ్నల్‌ అందడం లేదనీ సమాచారమ్‌. రష్మికా చాలా తెలివైన అమ్మాయి. అంత తొందరగా తప్పులో కాలేస్తుందని అనుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో నిలదొక్కుకుంటోన్న తనకు బాలీవుడ్‌కెళ్లి వాతలు పెట్టుకోవడం ఇష్టం లేదనీ అంటోందట. 

 

సౌత్‌లో తన కెరీర్‌ని ఇంకా స్ట్రాంగ్‌గా బిల్డప్‌ చేసుకోవాలనీ, ఆ తర్వాతే బాలీవుడ్‌ గురించి ఆలోచిస్తానని చెబుతోందట. ప్రస్తుతం రష్మికా చేతిలో మూడు బిగ్‌ ప్రాజెక్టులున్నాయి. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబో మూవీకి రష్మికాని ఇప్పటి నుండే లైన్‌లో పెట్టేశారు. దీంతో పాటు నితిన్‌తో 'భీష్మ' సినిమాలో నటిస్తోంది రష్మికా. ఈ రెండూ కాక ఈ మధ్యనే తమిళంలోనూ అడుగు పెట్టింది. కార్తి హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో రష్మికా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇదిలా ఉంటే, త్వరలోనే విజయ్‌ దేవరకొండతో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో రానుంది రష్మికా మండన్నా. 

ALSO READ: ఛాలెంజింగ్‌ రోల్‌లో 'హార్ట్‌ ఎటాక్‌' బ్యూటీ.!