ENGLISH

ప్రబాస్‌ 'సలార్‌'లో టాలీవుడ్‌ యంగ్‌ హీరో?

23 January 2021-16:43 PM

'కేజీఎఫ్‌' సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌తో 'సలార్‌' సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఓ లేటెస్ట్‌ అప్‌డేట్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్‌ నుండి ఓ యంగ్‌ హీరోని సెలెక్ట్‌ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ అండ్‌ విజువల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటించబోయే ఆ యంగ్‌హీరో ఎవరన్న అంశంపై ఆశక్తికరంగా చర్చ జరుగుతోంది. ప్రబాస్‌ హైటూ, వెయిట్‌కి మ్యాచ్‌ అయ్యేలా ఆ యంగ్‌ హీరోని సెలెక్ట్‌ చేశారట. ప్రబాస్‌ని మ్యాచ్‌ చేయగలిగే ఫిజిక్‌ ఉన్న ఆ యంగ్‌ హీరో ఎవరనేది తెలియాలంటే కూసింత ఆగాలి మరి. ఇకపోతే, ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌, 'కేజీఎఫ్‌ 2'తో బిజీగా ఉన్నారు. అలాగే ప్రబాస్‌ 'రాధే శ్యామ్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు.

 

ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తి కాగానే 'సలార్‌'పై దృష్టి పెట్టనున్నారు వీరిద్దరూ. మరోవైపు ప్రబాస్‌ చేయాల్సిన ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 'ఆది పురుష్‌' కూడా ట్రాక్‌లోనే ఉంది. అలాగే, నాగ అశ్విన్‌తో చేయాల్సి బిగ్‌ ప్రాజెక్ట్‌కి కసరత్తులు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్యాన్‌ ఇండియా మూవీసే. సో బిగ్గెస్ట్‌ ప్రాజెక్టులతో మన బాహుబలి ప్రబాస్‌ డైరీ ఫుల్ల్‌గా ఫుల్‌ అయిపోయినట్లే.

ALSO READ: అల్లుడు తేరుకున్నాడా? లేదా?