ENGLISH

జ‌గ‌న్‌తో మ‌ళ్లీ మీటింగ్‌... ఈసారి ఘ‌న స‌న్మానం

09 March 2022-11:00 AM

టాలీవుడ్ కి ఓ బెంగ తీరిపోయింది. ఏపీలో టికెట్ రేట్లు పెంచుతూ, ప్ర‌భుత్వం కొత్త జీవో జారీ చేసింది. టికెట్ రేట్లు మ‌రీ భారీగా పెంచ‌లేదు కానీ, గ‌తంతో పోలిస్తే మెరుగైన రేట్లే. నిర్మాత‌లు కూడా ఇంత‌కు మించి ఏం ఆశించ‌లేదు కూడా. సో... ఇప్పుడు పెద్ద సినిమాల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. కాక‌పోతే.. హీరో, ద‌ర్శ‌కుడి పారితోషికాలు మిన‌హాయించుకుని రూ.100 కోట్ల ఖర్చు అయిన సినిమాలే పెద్ద సినిమాల లిస్టులో చేర‌తాయ‌న్న పాయింట్ ఇబ్బంది క‌లిగించే అంశం.

 

ఏది ఏమైనా... ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని నిర్మాత‌లు హ‌ర్షించ‌క త‌ప్ప‌దు. కొన్ని లోటు పాట్లున్నా - గుడ్డిక‌న్నా, మెల్ల న‌మం అన్న‌ట్టు సాగిపోవాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్ నుంచి జ‌గ‌న్ కు స‌న్మానం ఒక‌టే బాకీ ఉంది. త్వ‌ర‌లో అదీ జ‌ర‌గబోతోంద‌ని స‌మాచారం. చిరంజీవితో కూడిన ఓ టీమ్ జ‌గ‌న్ ని క‌లిశాక‌, ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింది. మ‌ళ్లీ అలాంటి టీమ్ ఒక‌టి.. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి, చిత్ర‌సీమ త‌ర‌పున స‌న్మానించ‌బోతున్నార‌ని టాక్. మొన్న‌టి మీటింగ్‌లో కొద్ది మందికే ఛాన్స్ దొరికింది. ఈసారి టాలీవుడ్ నుంచి చాలామంది వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ తీసుకుని, ఆ త‌రవాత స‌న్మానానికి డేట్ ఫిక్స్ చేసే అవ‌కాశం వుంది.

ALSO READ: పెద్ద సినిమాలకి పండగ